ప్రమాదంలో 6.5 లక్షల మంది భారతీయులు
Published Tue, Jun 6 2017 11:57 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
ఖతార్ తో యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రయిన్, ఈజిప్టులు కటీఫ్ చెప్పేశాయి. ఉగ్రవాదాన్ని ఊతమిస్తుందనే నెపంతో ఖతార్ తో ఎలాంటి సంబంధాలు లేకుండా అన్ని రవాణా మార్గాలను మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.. ఇరాక్ కు వ్యతిరేకంగా 1991లో వచ్చిన గల్ఫ్ వార్ తర్వాత ఇదే అతిపెద్ద దౌత్యసంక్షోభం. దీంతో ఖతార్ లో నివసిస్తున్న 6.5 లక్షలకు పైగా భారతీయులు విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఖతార్ తో ఆ దేశాలు తెగదెంపులు చేసుకోవడం గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అంతర్గత విషయమని, కానీ అక్కడ నివసించే భారతీయుల విషయంలో ఆందోళన చెందాల్సి ఉందని సుష్మా స్వరాజ్ తెలిపారు.
గల్ఫ్ తమ స్వంత సంబంధాల విషయంలో ఎలాంటి సమస్యలు రావాలని భారత్ కోరుకోలేదని, కానీ ఈ దేశాలు ముందుగానే ఈ చర్యలు తీసుకుని ఉండాల్సిందని చెప్పారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడాలని తాము కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అరబ్ దేశాలతో ఆర్థిక, భద్రతా సంబంధాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. 2014లో కూడా సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ లు కూడా ఈవిధంగానే ఖతార్ పై వేటు వేశాయి. 10 నెలల తర్వాత మళ్లీ సంబంధాలు కొనసాగాయి. ఇటీవల కాలంలో ఐఎస్ వ్యవస్థాపకులను తయారుచేయడంలో ఖతార్ ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ఈ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
Advertisement