కర్ణాటక,మాలూరు: ఓ కరోనా అనుమానితుడు పెట్రోల్ బాటిల్‌తో గ్రామ పంచాయతీ కార్యాలయంలో భైఠాయించి హంగామా సృష్టించాడు. పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానని అందరినీ భయాందోళనకు గురిచేసిన సంఘటన బుధవారం తాలూకాలోని నిడఘట్టహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తన గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టాడు. ఈ వ్యక్తి నిడఘట్టహళ్లి గ్రామానికి చెందినవాడు, బెంగుళూరులో నివాసం ఉంటుండి ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు గత కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. ఇది తెలిసి వైద్య సిబ్బంది అతన్ని గ్రామంలోనే ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచారు.
నచ్చజెప్పిన ఎమ్మెల్యే
దీనిని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసి తనను అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆరోగ్య శాఖ సిబ్బంది తన ఇంటికి వచ్చి క్వారెంటైన్ చేశారు, ఫోటోలు తీశారు, దానినే సోషల్ మీడియాలో వారు ప్రచారం చేశారు. ఇతరుల ఫోటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నించాడు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కె వై నంజేగౌడ గ్రామానికి చేరుకుని కిటికీ ద్వారా క్వారెంటైన్ చేసిన వ్యక్తితో మాట్లాడారు. చివరికి అతనిని పంచాయతీ కార్యాలయ గది నుంచి బయటకు రప్పించి హోం క్వారంటైన్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment