
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ ఉన్నతస్థాయి నేతలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఏబీపీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా ఈ వివరాలు వెల్లడించారు. యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ‘సోనియా, రాహుల్‌లు రోజూ యోగా చేస్తారు. రాహుల్‌తో నాకు స్నేహపూర్వక సం బంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్‌ను రాందేవ్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. అయితే, యూపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందున గ్రేటర్ నోయిడా నుంచి పతంజలి ఫుడ్, హెర్బల్ పార్క్‌ను తరలిస్తానంటూ హెచ్చరించిన కొద్ది రోజులకే రాహుల్‌ను ప్రశంసించారు. కాగా, 2011లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాందేవ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment