సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ కోరలుచాస్తున్న వేళ నమస్తే ట్రంప్ ఈవెంట్ నిర్వహణ, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడం, కరోనా యోధుల కోసం ప్రజలను కొవ్వొత్తులు వెలిగించాలని కోరడం..వంటి చర్యలను రాహుల్ ఎత్తిచూపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరోనావైరస్‌పై పోరాటంలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని కేంద్రం పేర్కొనడాన్ని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ కలకలం మొదలైన ఫిబ్రవరి నుంచి మోదీ సర్కార్ నిర్ణయాలను ట్విటర్ వేదికగా రాహుల్ తప్పుపట్టారు.
ఓవైపు కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించడం, అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోవడం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడం, తాజాగా రాజస్ధాన్ సర్కార్‌ను అస్ధిరపరచడం, ప్రజలను కొవ్వొత్తులు వెలిగించాలని కోరడం వంటి కార్యక్రమాలతో కాలక్షేపం చేసిందని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలతోనే భారత్ కరోనా వైరస్‌పై పోరాటంలో స్వయం సమృద్ధి సాధించిందని రాహుల్ ఎద్దేవా చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ట్రాంగ్‌మేన్ ఇమేజ్ ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద బలహీనతగా మారిందని రాహుల్ సోమవారం పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరులో అసత్యాలు, చైనాతో ప్రతిష్టంభనపై వాస్తవాలను కప్పిపుచ్చడం వంటి చర్యలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చదవండి : ‘మోదీ చైనా ఒత్తిడికి లొంగిపోయారు.. అందుకే ఇలా’
Comments
Please login to add a commentAdd a comment