
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వీకెండ్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పెషల్ టూర్ ప్లాన్ చేశారు. ఇటలీలో ఉన్న అమ్మమ్మను సర్‌ప్రైజ్ చేసేందుకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హోలీ వీకెండ్‌లో 93 ఏళ్ల నానిని సందర్శించి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. తన అమ్మమ్మ ఈ ప్రపంచంలోనే దయామయి అని కొనియాడారు. ఆమెను కలిసి ఆప్యాయంగా కౌగిలించుకోవాలనుందని.. అందరికీ హోలీ శుభాకాంక్షలంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
అంతకుముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పాలక బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆ పార్టీకి చుక్కెదురైందని..కాంగ్రెస్‌కు ఘనవిజయం దక్కిందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఈ ఫలితాలు సంకేతమన్నారు.
My Nani is 93. She’s the kindest soul ever. This Holi weekend, I’m going to surprise her! I can’t wait to give her a hug.... #HappyHoli to all of you. Have a joyful celebration..
— Office of RG (@OfficeOfRG) March 1, 2018
Comments
Please login to add a commentAdd a comment