
దుబాయ్ : రానున్న ఎన్నికల్లో గెలుపు కంటే కూడా మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శనివారం ఇక్కడి ఐఎమ్‌టీ దుబాయ్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ గెలుపుకంటే మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కొబోతున్నామని తెలిపారు. జర్నలిస్ట్‌ల మీద కాల్పులు.. వేర్వేరు కారణాల పేరు చేప్పి జనాల మీద జరిగే దాడులను ఆపడమే నా ముందున్న అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.
మనక్కావాల్సింది ఇలాంటి భారతదేశం కాదు. ఓర్పు అనేది మన సంస్కృతిలో భాగం. కానీ ప్రస్తుత ప్రభుత్వం వల్ల దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ఒక అంశాన్ని వేర్వేరు కోణాల్లో ఎలా చూడాలనే విషయం భారతదేశమే తనకు నేర్పిందన్నారు. అంతేకాక భారతదేశంలో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే.. విదేశాలకు వెళ్లిన వారంతా తిరిగి దేశంలోకి వస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment