సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ తీరుతో 2018లో రోజూ 30,000 ఉద్యోగాలు ఊడిపోయాయని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బుదవారం జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో కోటి ఉద్యోగాలు సృష్టిస్తానని ఊదరగొట్టిన మోదీ 2018లో ఒక్క ఏడాదే కోటి ఉద్యోగాలను దేశం కోల్పోయిందని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ ఒక్క ఉద్యోగాన్ని కూడా అందుబాటులోకి తేలేదని, 2018లో మోదీ ప్రతిరోజూ 30,000 ఉద్యోగాలను నాశనం చేశారని దుయ్యబట్టారు. దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈశాన్య భారతంలోనూ ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ప్రధానికి ఆర్థిక అంశాలపై అవగాహన లేదని, నోట్ల రద్దు ప్రహసనంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని మరోమారు గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా రాహుల్ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment