సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, విద్యార్ధులు, యువత, మధ్యతరగతిని విస్మరించి తనకు కావాల్సిన అత్యంత సంపన్నులతోనే భేటీ అవుతున్నారని దుయ్యబట్టారు. నీతిఆయోగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆర్థిక వేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలతో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రైతులు, చిన్నవ్యాపారులు, విద్యార్ధులు, ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రధాని మోదీకి అవసరం లేదని సూట్‌బూట్‌సర్కార్ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ ట్వీట్ చేశారు. తన సన్నిహిత సంపన్న పారిశ్రామికవర్గాల ప్రయోజనాలకే ప్రధాని మోదీ పట్టం కడతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment