మూసుకుపోయిన 135 రోడ్లు!
డెహ్రాడూన్: విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దాదాపు 135 రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా పలు యాత్రా మార్గాలు మూసుకుపోయిన పరిస్థితి తలెత్తింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఉత్తరకాశీలో 34 రోడ్లు, తెహ్రీలో 23, పౌడీలో 21, డెహ్రాడూన్ లో 17, చమోలీ 15, బాగేషేర్లో 8, చంపావత్, అల్మోరాలో ఆరు, హరిద్వార్ లో నాలుగు, నైనిటాల్ 1 రహదారి దాదాపు ధ్వంసమయ్యాయి. పిందర్, కాళీ, మందాకిని, భగీరథీ, అలకనంద, గంగా నదులు ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. యుమునోత్రి, గంగోత్రి, భద్రీనాథ్, కేదర్ నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలకు దాదాపు మార్గాలు మూసుకుపోయినట్లయింది.