
చండీగఢ్ నూతన మేయర్‌గా బీజేపీ నేత రాజేష్ కలియా ఎన్నిక
చండీగఢ్ : గతంలో పాత వస్తువులు విక్రయించి పొట్టుపోసుకున్న రాజేష్ కలియా చండీగఢ్ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 ఓట్లకు గాను 16 ఓట్లు రాబట్టిన కలియా అత్యున్నత పదవిని అలంకరించారు. తిరుగుబాటు నేత సతీష్ కైంథ్‌కు కేవలం 11 ఓట్లు పోలయ్యాయి. వాల్మీకి వర్గానికి చెందిన తాను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్ధాయికి చేరుకున్నానని బీజేపీ తనను అక్కునచేర్చుకుని అందలం ఎక్కించిందని చెప్పుకొచ్చారు.
తన తండ్రి కుందన్ లాల్ స్వీపర్‌గా పనిచేసేవారని, తన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ స్వీపర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. తాను బాల్యంలో స్కూల్‌కు వెళ్లివచ్చిన తర్వాత పాత బట్టలు సేకరించి తన సోదరులతో కలిసి విక్రయించేవాడినని చెప్పారు. తాను ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో తాను మేయర్‌గా ఎదుగుతానని ఎన్నడూ ఊహించలేదని కలియా పేర్కొన్నారు. 1984లో బీజేపీ, ఆరెస్సెస్‌లో చేరి ఈస్ధాయికి ఎదిగానన్నారు. రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నందుకు తాను 15 రోజులు జైలు జీవితం గడిపానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment