సాక్షి, ముంబై : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగానికి వెనుకాడనని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన చర్యలను ఆమె సమర్ధించారు. పుల్వామా దాడి తర్వాత పాక్‌కు దీటుగా బదులిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలన్నీ సరైనవేనని రాఖీ సావంత్ సమర్ధించారు.
దేశం కోసం చనిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను శత్రు శిబిరాల్లోకి 50 నుంచి 100 బాంబులు తీసుకెళతానని, అవసరమైతే వారిని మట్టుబెట్టి వస్తానని చెప్పుకొచ్చారు. పుల్వామా దాడికి మోదీజీ సరైన సమాధానం ఇచ్చారు. పాక్ కస్టడీలో ఉన్న మన పైలట్లు సురక్షితంగా తిరిగి దేశానికి చేరుకోవాలని తాను ప్రార్ధిస్తున్నానని చెప్పారు. పంజాబ్‌లోని లూథియానాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాఖీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment