నేను దావూద్తో మాట్లాడా.. | Ram Jethmalani claims he spoke to Dawood Ibrahim | Sakshi
Sakshi News home page

నేను దావూద్తో మాట్లాడా..

Published Sat, Jul 4 2015 2:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

నేను దావూద్తో మాట్లాడా..

నేను దావూద్తో మాట్లాడా..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు  సీనియర్  న్యాయవాది  రాంజెఠ్మలానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మోస్ట్ వాంటెడ్  టెర్రరిస్ట్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో  పోన్లో మాట్లాడినట్టు అంగీకరించారు. న్యాయవిచారణను  ఎదుర్కొనేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని, ఇందుకుగాను  ఇండియాకు తిరిగి రావాలనుకున్నాడనీ పేర్కొన్నారు. కానీ భారతదేశంలో తన ప్రాణానికి ముప్పు ఉన్నట్టుగా దావూద్ భావిస్తున్నాడని..ఇక్కడి పోలీసుల థర్డ్ డిగ్రీ విచారణకు భయపడుతున్నాడని రాంజెఠ్మలానీ తెలిపారు.

ఈ విషయాన్ని  అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్కు రాత పూర్వకంగా  తెలియజేశానన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు ఆయన, ఎన్డీయే ప్రభుత్వం తిరస్కరించారని పేర్కొన్నారు.  అలాగే 1993  నాటి ముంబై   పేలుళ్లతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా ఈ  కేసులో ఇరికించారని  దావుద్ వాపోయాడని  ఆయన తెలిపారు.  ఇండియాలో తనకు న్యాయం  జరుగుతుందని తాను  హామీ  ఇస్తే తప్పకుండా  దేశానికి తిరిగి వస్తానని తనతో చెప్పినట్టుగా  జెఠ్మలానీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement