ఆమె ఒప్పుకుంటే నేను సిద్ధం | Ram Jethmalani offers Herald help, Sonia Gandhi yet to accept it | Sakshi
Sakshi News home page

ఆమె ఒప్పుకుంటే నేను సిద్ధం

Published Wed, Jan 13 2016 12:11 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఆమె ఒప్పుకుంటే  నేను సిద్ధం - Sakshi

ఆమె ఒప్పుకుంటే నేను సిద్ధం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి  ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ  బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోనియాగాంధీ  తరఫున వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. సోనియా కోరితే ఆ కేసును వాదించేందుకు సిద్ధమని రాంజెఠ్మాలనీ ప్రకటించడం ఆసక్తిని రేపింది. 
 
సోనియాగాంధీ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టవేసిన అనంతరం జెఠ్మలానీ ఈ  అసాధారణ ప్రకటన చేశారు. ఈమేరకు డిసెంబర్ 11 న   సోనియాకు ఒక లేఖ రాశారు. సోనీయా గాంధీ , రాహుల్  గాంధీ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానన్నారు.   ఈకేసులో వారి ప్రమేయం ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు బనాయించారని  ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సమర్ధవంతమైన  న్యాయవాదులు వున్నారనీ, అయినా తాను  ఎలాంటి   రుసుం తీసుకోకుండా వారిని తరపున వాదించడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో మాజీ బీజేపీ నేత,  వివాదాస్పద న్యాయవాది   జెట్మలానీ ఆఫర్ కు సోనియా ఎలా   స్పందిస్తారో  చూడాలనే చర్చకు తెర లేపింది. 
 
కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులు గోల్ మాల్ చేశారని సోనియాపై బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి కేసుపెట్టిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ కేసును వాదించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించడం పాధ్యాన్యతను సంతరించుకుంది.  శీతాకాల  పార్లమెంట్  సమావేశాల్లో  ఈ  వివాదం ఉభయసభల్లో ప్రకంపనలు రేపింది.  కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాహుల్ గాంధీ ఇటీవల పాటియాలా కోర్టుకు హాజర య్యారు.  కోర్టులో విచారణ అనంతరం  నేషనల్ హెరాల్డ్ కేసు ఫిబ్రవరి 20, 2016కు వాయిదా పడింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement