herald case
-
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌లో మంగళవారం సోదాలు నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజుల పాటు ప్రశ్నించిన వారంలోపే ఈ దాడులు చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా విచారణ సందర్భంగా.. న్యూస్‌పేపర్ నిర్వహణపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాల్లో సోనియా, రాహుల్ గాంధీల పాత్రపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు జూన్‌లో రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది ఈడీ. Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a — ANI (@ANI) August 2, 2022 ఇదీ చదవండి: National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం -
రాహుల్, సోనియాలకు షాక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల 2011–12 ఏడాది ఆదాయ పన్ను రిటర్నులను తిరిగి మదించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. రాహుల్, సోనియాల పన్ను రిటర్నులను పరిశీలించి ఆదేశాలు జారీచేయొచ్చు కానీ, విచారణ జరిగే తదుపరి తేదీ వరకు వాటిని అమలుచేయరాదని ఆదాయ పన్ను శాఖకు సూచించింది. రాహుల్, సోనియాలకు వ్యతిరేకంగా మదింపు ఉత్తర్వులను అమలుచేయొద్దని కోర్టు ఆదేశించడంపై ఐటీ విభాగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్‌ల పిటిషన్ మెరిట్‌ను నిర్ధారించాలంటే లోతుగా పరిశీలించాలని పేర్కొంది. కేసు అసలు సంగతి.. నేషనల్ హెరాల్డ్ కేసుగా పేరొందిన ఈ మొత్తం వ్యవహారంలో సోనియా, రాహుల్‌కు 2015, డిసెంబర్లో బెయిల్ దొరికింది. బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఓ ట్రయల్ కోర్టుకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సోనియా, రాహుల్‌ల ఆదాయ పన్ను రిటర్నులను పునఃమదించేందుకు ఐటీ విభాగం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ వారు దాఖలుచేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు ప్రకారం..కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న రూ.90.25 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) తిరిగి చెల్లించలేకపోయింది. 2010లో కాంగ్రెస్ స్థాపించిన యంగ్ ఇండియా(వైఐ) అనే సంస్థకు ఏజేఎల్ షేర్లు, ఆస్తుల్ని బదిలీచేయడం ద్వారా సోనియా, రాహుల్ భారీ ఆర్థిక అవకతవకలు, మోసానికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. -
హెరాల్డ్ కేసులో స్వామి అభ్యర్థన తిరస్కృతి
న్యూఢిల్లీ: సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని డాక్యుమెంట్లు కావాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యమైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) రూ.90.25 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఏజేఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రుణానికి సంబంధించిన డాక్యుమెంట్లు తనకు ఇవ్వాలంటూ స్వామి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. -
హెరాల్డ్ కేసులో సోనియాకు ఊరట
-
హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట
ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదన మాత్రమే విని ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ హైకోర్టులో అప్పీలు చేయగా.. దీనిపై విచారించిన జస్టిస్ పీఎస్ తేజీ.. ట్రయల్ కోర్టు ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నా యన్నారు. హెరాల్డ్ ఆస్తుల విక్రయంలో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన 2010-11 నాటి ఆర్థిక వివరాలకు సంబంధించి పత్రాలను అందజేయాలని, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలు, కార్పొరేట్ వ్యవహారాలు, ఆదాయపన్ను విభాగాలను, కాంగ్రెస్‌ను జనవరి 11, మార్చి 11న ట్రయల్ కోర్టు ఆదేశించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో దరఖాస్తును పూర్తిగా పరిశీలించకుండా, ప్రతివాదుల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం చట్టరీత్యా చెల్లుబాటు కాదంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నట్టు స్పష్టం చేసింది. -
ఆమె ఒప్పుకుంటే నేను సిద్ధం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోనియాగాంధీ తరఫున వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. సోనియా కోరితే ఆ కేసును వాదించేందుకు సిద్ధమని రాంజెఠ్మాలనీ ప్రకటించడం ఆసక్తిని రేపింది. సోనియాగాంధీ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టవేసిన అనంతరం జెఠ్మలానీ ఈ అసాధారణ ప్రకటన చేశారు. ఈమేరకు డిసెంబర్ 11 న సోనియాకు ఒక లేఖ రాశారు. సోనీయా గాంధీ , రాహుల్ గాంధీ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానన్నారు. ఈకేసులో వారి ప్రమేయం ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు బనాయించారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సమర్ధవంతమైన న్యాయవాదులు వున్నారనీ, అయినా తాను ఎలాంటి రుసుం తీసుకోకుండా వారిని తరపున వాదించడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో మాజీ బీజేపీ నేత, వివాదాస్పద న్యాయవాది జెట్మలానీ ఆఫర్ కు సోనియా ఎలా స్పందిస్తారో చూడాలనే చర్చకు తెర లేపింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులు గోల్ మాల్ చేశారని సోనియాపై బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి కేసుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును వాదించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించడం పాధ్యాన్యతను సంతరించుకుంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వివాదం ఉభయసభల్లో ప్రకంపనలు రేపింది. కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాహుల్ గాంధీ ఇటీవల పాటియాలా కోర్టుకు హాజర య్యారు. కోర్టులో విచారణ అనంతరం నేషనల్ హెరాల్డ్ కేసు ఫిబ్రవరి 20, 2016కు వాయిదా పడింది. -
హెరాల్డ్ కేసులో నేడు కోర్టుకు సోనియా, రాహుల్
-
హెరాల్డ్ కేసులో నేడు కోర్టుకు సోనియా, రాహుల్
బెయిల్ కోరే అవకాశం న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ శనివారం పాటియాలా హౌస్ జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులతో భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. భద్రతా ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో పరిశీలించింది. కోర్టు ప్రాంగణంలో అదనంగా 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పలు అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై పోలీసు అధికారులు న్యాయమూర్తితో సమావేశమయ్యారని కోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనియా, రాహుల్ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తాజాగా సంకేతాలిచ్చింది. ‘బెయిల్‌తోపాటు చట్టపరమైన మార్గాలు, అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. కోర్టు విచారణలో పార్టీ ఏమాత్రం జోక్యం చేసుకోబోదు. అందుకే ఎవరూ కోర్టుకు రావొద్దని కార్యకర్తలకు సూచించాం’ అని సోనియా ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. దీనికి అంత ప్రాముఖ్యం ఇవ్వొద్దని పార్టీ భావిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. అధినేత కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను కూడా వారు ఖండించారు. -
హెరాల్డ్ కేసులో ఐటీ శాఖకు జైట్లీ పరోక్ష సూచనలు: సిబల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నేరంగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసులివ్వాలని పరోక్షంగా సూచించారని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ శనివారమిక్కడ ఆరోపించారు. హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ మోసం చేసిందని, ధనాన్ని మళ్లించిందని చేస్తున్న ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. కాగా, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని జైట్లీ ఆరోపించారు. ఈ కేసులో ప్రధానమంత్రి కార్యాలయంపై అనవసరంగా బురద చల్లుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలో ఆరోపించారు. -
అది ఎప్పటికీ నెరవేరబోదు: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన పట్ల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఈ కేసు ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదని ఆయన ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యల ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను అడ్డుకోవాలని వారు చూస్తున్నారని, ఇది ఎప్పటికీ జరుగబోదని ఆయన మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం పాటియాలా కోర్టు విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించినా వారు హాజరుకాకపోవడం గమనార్హం. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు వెనుక రాజకీయ పరమైన దురుద్దేశం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే. -
కోర్టుకు హాజరుకాని సోనియా, రాహుల్
-
కోర్టుకు హాజరుకాని సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాటియాలా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో తమ నేతలు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని, తాము సుప్రీంకోర్టుకు వెళతామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, సోనియా, రాహుల్ తరుపున కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రమే పాటియాల కోర్టుకు హాజరయ్యారు. మరికొందరు వ్యక్తులను సుబ్రహ్మణ్యస్వామి తన వెంట తీసుకొని కోర్టుకు వచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కి సమన్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు రద్దు చేయాలని వారు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు తోసిపుచ్చింది. విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కొట్టివేసింది. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించినా వారు హాజరుకాకపోవడం గమనార్హం. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు వెనుక రాజకీయ పరమైన దురుద్దేశం ఉందన్నారు చెప్తున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.