న్యూఢిల్లీ: సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని డాక్యుమెంట్లు కావాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితరులతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యమైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) రూ.90.25 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఏజేఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రుణానికి సంబంధించిన డాక్యుమెంట్లు తనకు ఇవ్వాలంటూ స్వామి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.