అరుదైన పాము లభ్యం | Rare Snake Available In Orissa | Sakshi
Sakshi News home page

అరుదైన పాము లభ్యం

Published Sat, Jun 23 2018 12:37 PM | Last Updated on Sat, Jun 23 2018 12:37 PM

Rare Snake Available In Orissa - Sakshi

 పట్టుబడిన పహడి సుందరి పాము

జయపురం: జయపురం ప్రాంతానికి పాముల స్వర్గమని పేరు. ప్రజ లకు ఇక్కడ అనేక రకాల పాములు కనిపిస్తాయి. పాముల జాతిలో అరుదైన పహడి సుందరి(పర్వత సుందరి)గా స్థానికులకు పరిచయమైన పహడి సుందరి జయపురంలో శుక్రవారం లభ్యమైంది.

వన్యప్రా ణి సురక్షా సమితి జయపురం ప్రతినిధి కృష్ణ కైలాశ్‌ షడంగి జయపురం డివిజన్‌ పరిధిలో గల జయపురం ఫారెస్ట్‌ రేంజ్‌ పాత్రోపుట్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ జబకనడి గ్రామంలో దీనిని పట్టుకున్నారు. ఇది అపురూపమైన పాము అని ఆయన తెలిపారు. అరుదైన ఈ పామును సమీప అడవి లో భద్రంగా విడిచిపెట్టామని ఆయన తెలిపారు. ఎటువంటి పామునైనా, వన్యప్రాణినైనా చంపవద్దని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని అందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుచేత వన్యప్రాణులను రక్షించేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

 నడుస్తున్న పహడి సుందరి పాము 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement