సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం మధ్యాహ‍్నం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది నిమిత్తం ఈనెల 27వతేదీ వరకు ఉండనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి దంపతులకు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో ఏపీ ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఈనెల 27న అమరావతి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment