Rastrapati
-
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం చేశారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం ఇదే. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్‌కు ఉద్వేగభరిత క్షణం’.. -
రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు
-
ఉపాధ్యాయుల చేతుల్లో భావితరం భవిష్యత్తు భద్రం : రాష్ట్రపతి
-
15ఏళ్ల తర్వాత రాష్ట్రపతి కోవింద్ రైలు ప్రయాణం
-
రాజకీయ సంక్షోభం : రాష్ట్రపతికి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు.. బీజేపీ కుట్ర చేస్తోందంటూ లేఖ పేర్కొంది. గవర్నర్లను పావుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. అలాగే రాజస్తాన్‌లో నెలకొన్న ప్రతిష్టంభన రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 31న రాష్ట్ర అసెంబ్లీని సమావే పర్చాలంటూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. (ప్రధాని మోదీకి గెహ్లోత్ ఫోన్) దీనిని గవర్నర్ సోమవారం తిరస్కరించారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గెహ్లాత్ గవర్నర్ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఇటీవల రాజ్‌భవన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సమస్య పరిష్కరానికి ముందుకు రాకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ఇటీవల ప్రకటించారు. దానిలో భాగంగానే ముందుగా లేఖ రాశారు. (మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్) -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది నిమిత్తం ఈనెల 27వతేదీ వరకు ఉండనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి దంపతులకు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఈనెల 27న అమరావతి వెళతారు. -
రాష్ట్రపతికి జగన్ లేఖ
-
సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతికి జగన్ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి లేఖ రాశారు. మిమ్మల్ని నేరుగా కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలనుకున్నా, అయితే అపాయింట్మెంట్ దొరకనందున లేఖ రాస్తున్నట్లు రాష్ట్రపతికి తెలిపారు. అధికార పక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై రాజ్యాంగాన్ని, సాంప్రదాయాలను ఉల్లంఘించి రాష్ట్రాన్ని విభజించాయని ఆ లేఖలో తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విభజన ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయానికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్రపతి రాసిన లేఖకు జతపరిచారు. అయిదేళ్ల ప్రత్యేక హొదాతో సీమాంధ్రకు ఒరిగేదేమీలేదు. ప్రత్యేక హోదా కనీసం 15 ఏళ్లపాటు ఉంచాలి. మా వినతులపై న్యాయబద్ధతతో కూడిన హామీ ఇవ్వండి. కొత్తరాజధాని నిర్మాణానికి సంబంధించి నిధుల మంజూరుపై బిల్లులో ఎలాంటి హామీలేదు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 14 ఏళ్లు అవుతుంది. ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అప్పట్లో 10వేల కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. కానీ కేంద్రం విదిల్చింది 400 కోట్ల రూపాయలే. ఇప్పుడు సీమాంధ్ర రాజధానికి మౌళిక నిర్మాణాలైన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, వివిధ ప్రభుత్వశాఖల భవనాలు, అంతర్జాతీయ విమానాశ్రయం... వంటి వాటికి వేలాది కోట్ల రూపాయలు అవసరం అమవుతాయి. వాటిని ఎలా సమకూరుస్తారో బిల్లులో పొందుపరచలేదు. సింగరేణి కాలరీస్‌లో కూడా సీమాంధ్రకు వాటా ఇచ్చేందుకు తిరస్కరించారు అని ఆ లేఖలో జగన్ వివరించారు. -
'టి' బిల్లుకు ప్రణబ్ ఓకె, రేపు రాజ్యసభకు..
-
తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం నిన్న సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి పరిశీలించిన తరువాత ఈ ఉదయం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదించడంతో బిల్లుకు సంబంధించి ఒక దశ ముగిసినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడినందున బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇదిలా ఉండగా, బిల్లుపై సభలో చర్చించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బిల్లు సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్‌జైట్లీతో కమల్‌నాథ్ చర్చలు జరిపారు. బిల్లు విషయం చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌నాథ్, జైరామ్ రమేష్ సమావేశమయ్యారు. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తొందరపడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం నేతలు ముందు చెప్పన ప్రకారం ఈ నెల 12న అంటే ఎల్లుండి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రవేశపెట్టనున్నారు. -
తెలంగాణ బిల్లుపై రేపు రాష్ట్రపతి సంతకం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు సంతకం చేయనున్నారు. ప్రధాని కార్యాలయం ద్వారా బిల్లు ఈ సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. బిల్లును రాష్ట్రపతి పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం ఆయన సంతకం చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తరువాత ఈ నెల 11న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నేతలు ముందు చెప్పన ప్రకారం ఈ నెల 12న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రవేశపెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. -
గడువుపై కొనసాగుతున్న ఉత్కంఠ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముందు ప్రకటించిన ప్రకారం శాసనసభ శీతాకాల సమావేశాలు నేటితో ముగియాలి. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు కూడా రాష్ట్రపతి ముందు ఇచ్చిన గడువు ప్రకారం ఈ రోజే ఆఖరు. ఒక పక్క బిల్లుపై చర్చ ముగియలేదు - మరో పక్క చర్చకు గడువు పొడిగించమని కోరిన అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. చర్చకు గడువు పొడిగింపుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా సాగకపోవడంతో సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల గడువు పొడిగించాలంటూ ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసింది. రాష్ట్రపతి వారం రోజులు గడువు పొడిగించే అవకాశం ఉండవచ్చని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిన తరువాత అసెంబ్లీ స్పీకర్ లేఖ రాయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాయడంపై న్యాయపరమైన చర్చ జరుగుతోంది. అందువల్లే నిర్ణయం వెలువడడంలో ఆలస్యం అవుతుండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై అటార్నీ జనరల్ నుంచి రాష్ట్రపతి న్యాయ సలహా కూడా కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు గడువు పొడిగింపు వద్దంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. గడువు పొడిగింపు వల్ల ప్రయోజనం లేదని, సభా సమయాన్ని వృథాచేశారని, గడువు పొడిగిస్తే పార్లమెంటులో బిల్లు అనుమతి పొందేందుకు సమయం సరిపోదని వాటిలో పేర్కొన్నారు. చర్చకు గడువు పొడిగించే విషయమై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరపాలని, ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. -
తెలంగాణ బిల్లుపై చర్చకు మరోవారం గడువు?
-
తెలంగాణ బిల్లుపై చర్చకు మరోవారం గడువు?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం గడువు ఇచ్చేందుకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. వారం గడువు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డిటివీ ప్రసారం చేసింది. కేంద్రం 10 రోజులు గడువు పొడిగించమని కోరినా రాష్ట్రపతి వారానికే మొగ్గు చూపారని ఆ టివి తెలిపింది. ఈ ప్రకారం అయితే ఈ నెల 30 లోగా సభలో చర్చ పూర్తి కావాలసి ఉంటుంది. వారం రోజులు గడువు ఇచ్చినట్లు అధికారిక ప్రకటన రేపు వెలువడుతుందని తెలుస్తోంది. -
పోటాపోటీగా సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు రాష్ట్రపతితో భేటీ
ఢీల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విడివిడగా కలిశారు. తమ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లతోపాటు మరో ముగ్గురు కనుమూరి బాపిరాజు, మాగంటి శ్రీనివాస రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్రపతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదాలో లోపాలున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వారు రాష్ట్రపతికి చెప్పారు. అందువల్లనే తాము అవిశ్వాసం ప్రకటించినట్లు వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపిచే విషయంలో గత సాంప్రదాయం పాటిస్తూ అత్యధిక గడువు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా, తెలంగాణ బిల్లును త్వరగా అసెంబ్లీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు రాష్ట్రపతిని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
ఓ అడుగు వెనక్కువెళ్లిన 'తెలంగాణ బిల్లు'
కేంద్ర మంత్రి మండలి సమావేశం వాయిదా పడటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఒక అడుగు వెనక్కు వేసినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కారణంగా ఈ రోజు జరుగవలసిన సమావేశం వాయిదాపడింది. కేంద్రం ముందు ప్రకటించిన ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితేనే పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు సమయం సరిపోయే పరిస్థితిలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం) ఈరోజు తుది నివేదిక ఇచ్చినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జరగవలసిన ప్రక్రియ జరగవలసిందే. కాంగ్రెస్ అధిష్టానం నేతలు చెప్పిన ప్రకారం అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపవలసి ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపడం - ఆ తరువాత శాసనసభ అభిప్రాయం రాష్ట్రపతికి పంపడం - రాష్ట్రపతి దానిని కేంద్రానికి పంపడం - పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం - ప్రాముఖ్యత గల బిల్లు అయినందున సుదీర్ఘ చర్చ...అంతా బిజీ షెడ్యూల్ ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉండేది. కేంద్ర కేబినెట్ సమావేశం వాయిదాపడిన నేపధ్యంలో ఓ ఆటంకం ఏర్పడినట్లే భావించాలి. ఈ నెలాఖరుకు కేంద్ర కేబినెట్ బిల్లు ఆమోదించినా మిగిలిన అన్ని ప్రక్రియలు పూర్తి అయి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి గానీ, చర్చకు గానీ సమయం సరిపోదు. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 5న ప్రారంభమై 20న ముగుస్తాయి. శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చే సమయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 45 రోజులు సమయం ఇచ్చారు. బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంటుకు రావడం అనేది రాష్ట్రపతి శాసనసభకు ఇచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతుండటం - విభజనకు అనేక సమస్యలు ఉన్న నేపధ్యంలో ప్రాముఖ్యత గల ఈ బిల్లుపై శాసనసభ చర్చించడానికి, అభిప్రాయం తెలియజేయడానికి కనీస సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఈ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లు ఆమోదం పొందడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు పొండిగించినా ఇతర ప్రక్రియలు పూర్తి కావడానికి కూడా సమయం సరిపోయే పరిస్థితిలేదు. రాష్ట్ర విభజన అనేది ప్రజాప్రయోజనం ఆలోచించి చేస్తున్నదేమీకాదు. కాంగ్రెస్ అధిష్టానం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ విభజనకు పూనుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయంగా ఆలోచించే కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడవలసిందే! -
హస్తినలో గవర్నర్ నరసింహన్ బిజీ బిజీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తొందరపడుతున్న పరిస్థితులలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి ముఖ్య నేతలందరిని కలిశారు. విభజనకు సంబంధించి కీలక అంశాలను ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తొలుత నార్త్‌బ్లాక్‌లో ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిగాయి. విభజనకు సంబంధించి అంశాలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఆయన బయటికి మాత్రం ఎటువంటి చర్చ జరగలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు. చిదంబరంతో చర్చలు ముగిసిన వెంటనే గవర్నర్ యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. టెన్ జన్‌పథ్‌లో దాదాపు పావుగంట సేపు ఆమెతో చర్చించారు. అక్కడి నుంచి బయల్దేరి కేంద్ర హోం మంత్రి షిండేను కలిశారు. మంత్రుల బృందంలో ప్రత్యేక ఆహ్వానితుడు, కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి వి.నారాయణస్వామి, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీంతోనూ నరసింహన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కూడా గవర్నర్ కలిశారు. చివరగా సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ ఇలా దేశరాజధానిలో అందరినీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన ప్రక్రియ శరవేగంతో జరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. -
ఢిల్లీలో వైఎస్ఆర్సిపి గళం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు ఢిల్లీలో తెలుగు ప్రజల గళం వినిపించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను, సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను వివరించారు. దేశ ప్రధమ పౌరుడికి, ప్రధానికి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడంలో వారు కృతకృత్యులయ్యారు. అంతే కాకుండా సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద రేపు ధర్నా కూడా చేయనున్నారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వాన్నంగా ఉంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అన్నివర్గాల ప్రజలూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులలో గత జులై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది. నిజానికి దేశంలో కొత్త రాష్ట్రాల డిమాండ్లు రావడంతో రెండో ఎస్సార్సీ వేయాలని 2001లోనే సీడబ్ల్యూసీ నిర్ణయించింది. గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ, హరిత ప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రాల డిమాండ్లను తోసిరాజని ఎకాఎకిన, హడావుడిగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. కాంగ్రెస్ ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సీమాంధ్రలో తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తే అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయి. సీమాంధ్రకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నదీజలాల సమస్య జఠిలమవుతుంది. ఇది అందరూ అంగీకరించవలసిన విషయం. జలవనరులు - ఆదాయ పంపిణీ - హైదరాబాద్ భవిష్యత్తు లాంటి కీలకమైన అంశాలను చర్చించకుండానే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా తుది నిర్ణయం ప్రకటించింది. విభజనతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులు - వివిధ వ్యాపార- పారిశ్రామిక అసోసియేషన్లు - పౌర సమాజాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అంగీకరించి తీరవలసిందే అన్న రీతిలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనపై తాంబూలాలు ఇచ్చేశాం-తన్నకు చావండి అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఈ విషయాలన్నింటితో కూడిన మెమోరాండంను విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానికి అందజేశారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బృందంలో విజయమ్మ వెంట ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, సుచరిత, ముఖ్య నేతలు మైసూరారెడ్డి, సోమయాజులు, కొణతాల రామకృష్ణతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో వైఎస్ఆర్సిపి మొదటి నుంచి ఒకే మాటపై ఉంది. విభజన అనివార్యమైతే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని, ఎవ్వరికీ అన్యాయం జరగకుండా కేంద్రం ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని కోరుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన తథ్యమంటూ జులై 30న కాంగ్రెస్ ప్రకటించింది. అప్పటికే ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు.ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితోపాటు రాజమోహన రెడ్డి కూడా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. విజయమ్మతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వా వారి దీక్షలను భగ్నం చేసింది. ఈ పరిస్థితులలో చంచల్‌గూడ జైలులో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ నేపధ్యంలో ప్రతినిధి బృందం ప్రధానిని కలిసింది. 57ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ రాజధాని హైదరాబాద్ నుంచే వస్తోందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, విద్య, పరిశోధన సంస్థలు ఇక్కడే ఉన్నాయని ప్రధానికి వివరించారు. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కూడా ఉండటంతో ప్రైవేట్ కంపెనీలు కూడా ఇక్కడే నెలకొల్పారు. పెట్టుబడులన్నీ ఇక్కడికే వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని ముందు వారు ఆందోళన వెలిబుచ్చారు. తెలుగు ప్రజల్లో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన పరిస్థితుల్లో జల వనరుల అంశాన్ని తేల్చకుండా ఎలా విభజిస్తారని వారు ప్రధానిని ప్రశ్నించారు. వీటిపై ప్రధాని స్పందించారు. మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేస్తామని వారికి చెప్పారు. ఆ కమిటీ రాష్ట్ర సమస్యల పరిష్కారాలను సూచిస్తుందని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపేంత వరకూ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆదేశించాలని ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. భవిష్యత్ పరిణామాలు ఆలోచించకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు విచారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. జులై 30 తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిందని విజయమ్మ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ నాలుగు పేజీల విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సమన్యాయం పాటించాలని కోరుతూ తాను దీక్ష చేసిన విషయాన్ని, జగన్ మోహన్ రెడ్డి జైల్లో చేస్తున్న దీక్ష విషయాన్ని ఆమె రాష్ట్రపతికి వివరించారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు యథాతథ స్థితి కొనసాగించాలన్నది తమ పార్టీ డిమాండ్‌ని విజయమ్మ రాష్ట్రపతికి తెలిపారు. ఆ తరువాత వారు జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కూడా కలిశారు. పరిస్థితిని వివరించారు. రాష్ట్ర విభజన విషయంలో ఎదురువుతున్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. విభజన అనేది చాలా బాధాకరమైన అంశమని శరద్ యాదవ్ అన్నారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన - రాష్ట్ర భవిష్యత్ - ప్రజా సంక్షేమం ...వంటి విషయాలలో వైఎస్ఆర్ సిపి పూర్తి స్పష్టతతో ఉంది. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయండి లేదా యథాతథంగా ఉంచండి అని ప్రకటించి పోరాడుతోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రజల పక్షం నిలబడి ఢిల్లీ వరకు వెళ్లి తెలుగువారి గళం వినిపించారు. ప్రజలు ఎంత ఉద్యమించినా ప్రధాన పతిపక్షం టీడీపీ మాత్రం ఇంకా రెండు కళ్ల సిద్దాంతాన్నే నమ్ముకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ సిద్ధాంత కర్త చంద్రబాబు రెండు కాళ్లకు బంధం వేసుకుని ప్రజలెటుపోతే తనకేంటి అని ఇంట్లో కూర్చున్నారు. -
అగ్నిగుండంలా మారిన రాష్ట్రం:విజయమ్మ
-
అగ్నిగుండంలా మారిన రాష్ట్రం:విజయమ్మ
న్యూఢిల్లీ: ప్రస్తుతం రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పార్టీ ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని విజయమ్మ ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పాటించలేదన్నారు. ఇలా సమన్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం ఆ పార్టీకి ఎవరు ఇచ్చారని విజయమ్మ ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజయమ్మ రాష్ట్రపతిని కోరారు. అంతకు ముందు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ప్రధానికి ఒక మెమొరాండం సమర్పించారు.