'టి' బిల్లుకు ప్రణబ్ ఓకె, రేపు రాజ్యసభకు.. | president pranab mukherjee approved telangana bill | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 10 2014 4:46 PM | Last Updated on Wed, Mar 20 2024 2:09 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం నిన్న సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి పరిశీలించిన తరువాత ఈ ఉదయం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదించడంతో బిల్లుకు సంబంధించి ఒక దశ ముగిసినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడినందున బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement