
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు.. బీజేపీ కుట్ర చేస్తోందంటూ లేఖ పేర్కొంది. గవర్నర్లను పావుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. అలాగే రాజస్తాన్‌లో నెలకొన్న ప్రతిష్టంభన రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 31న రాష్ట్ర అసెంబ్లీని సమావే పర్చాలంటూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. (ప్రధాని మోదీకి గెహ్లోత్ ఫోన్)
దీనిని గవర్నర్ సోమవారం తిరస్కరించారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గెహ్లాత్ గవర్నర్ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఇటీవల రాజ్‌భవన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సమస్య పరిష్కరానికి ముందుకు రాకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ఇటీవల ప్రకటించారు. దానిలో భాగంగానే ముందుగా లేఖ రాశారు. (మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్)
Comments
Please login to add a commentAdd a comment