తెలంగాణ బిల్లుపై రేపు రాష్ట్రపతి సంతకం | President will be signed tomorrow on Telangana bill | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుపై రేపు రాష్ట్రపతి సంతకం

Published Sun, Feb 9 2014 8:06 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - Sakshi

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు సంతకం చేయనున్నారు. ప్రధాని కార్యాలయం ద్వారా బిల్లు ఈ సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. బిల్లును రాష్ట్రపతి పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం ఆయన సంతకం చేసే అవకాశం ఉంది.  రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన  తరువాత ఈ నెల 11న  రాజ్యసభలో బిల్లును  ప్రవేశపెడతారు.

ఇదిలా ఉండగా, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నేతలు ముందు చెప్పన ప్రకారం ఈ నెల 12న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే   ఒక రోజు ముందుగానే ప్రవేశపెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement