కుండబద్దలు కొట్టిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్తో చర్చల విషయంలో భారత్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. తాము ఉగ్రవాదం అంశంపై మాత్రమే పాక్ తో చర్చకు సిద్ధమని.. కశ్మీర్ అంశంపై కాదని చెప్పింది. అసలు కశ్మీర్ అంశంపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ కోరుకున్నట్లు తాము చేయబోమని ప్రకటించింది.
కశ్మీర్ అంశంపై భారత్ తమతో చర్చకు రావాలని పాక్ విదేశాంగ కార్యదర్శి కోరిన నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి ఈ మేరకు స్పందించారు. భారత్-పాక్ దృష్టి పెట్టాల్సింది ఇరు దేశాల సరిహద్దులో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు జరగాల్సిన చర్చలపైనేగానీ, జమ్మూకశ్మీర్ అంశంపై కాదని ఆయన చెప్పారు.