రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్ చెల్లదు: కర్ణాటక హైకోర్టు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి రాష్ట్ర హైకోర్టులో సోమవారం భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్‌లో ఉన్న దాదాపు రూ.884 కోట్ల ఆస్తులు తిరిగి ఆయనకు చేరనున్నాయి. బళ్లారి జిల్లాలో ఇనుప గనుల తవ్వకాలతో అక్రమ మార్గంలో ఆస్తులు సంపాదించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి ఈడీ గతంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.884 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ గాలి జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది.
గాలి జనార్దనరెడ్డికి ఊరట
Published Tue, Mar 14 2017 1:23 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement