gali Janardan Reddy
-
బీజేపీలోకి గాలి జనార్ధన్ రెడ్డి..
-
మళ్లీ బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి
సాక్షి, బెంగళూరు: మైనింగ్ వ్యాపారి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పారీ్టలోకి చేరబోతున్నారు. కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పారీ్టలో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలిపారు. నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. -
జనార్దనరెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం
సాక్షి, బళ్లారి: మాజీ మంత్రి, కేఆర్పీపీ అధినేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, స్వాగతిస్తామని ఆయన సోదరుడు, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు బీజేపీలోకి వస్తే త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా బళ్లారి లోక్‌సభ సీటు గెలవడం ఖాయమన్నారు. బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఆయన లేకపోతే జిల్లాలో బీజేపీ లేదనే మాటల్లో నిజం లేదన్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదనే విషయం అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. కేఆర్పీపీ వల్ల తాను, మాజీ మంత్రి శ్రీరాములు ఓడిపోయామనడంలో కూడా వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల వల్ల పరాజయం ఎదురైందన్నారు. గెలుపు ఓటములు ప్రజల చేతుల్లో ఉంటాయని, వారి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందేనన్నారు. గాలి జనార్దనరెడ్డిది మాస్టర్ మైండ్, మాజీ మంత్రి శ్రీరాములు ప్రజల మనిషి అని, వీరిద్దరి కలయికతో ఈ ప్రాంతంలో బీజేపీ బలపడేందుకు దోహదపడతుందన్నారు. ఐకమత్యంతోనే మహాబలం అని అనాది కాలంగా నిరూపితం అయిందని, శాసనసభలో మంత్రిగా ముందు వరుసలో కూర్చోవాల్సిన ఆయన ఒకే ఒక్కడుగా గెలిచి వెనుక వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. -
ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిపై నారా భరత్‌రెడ్డి ధ్వజం
సాక్షి,బళ్లారి: రెండు రోజులు క్రితం బళ్లారి నగరంలోని కేఆర్పీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాలు జరిగిన రోజున వర్చువల్ ద్వారా మాజీ మంత్రి,గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ కేఆర్పీపీ కార్యకర్తలకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించిన తరణంలో బళ్లారినగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతూ ఎంతంత బడా బాబులకే భయపడలేదు. ... వస్తే మేము భయపడుతామా? అని అన్నారు. రాష్ట్రంలో కేఆర్పీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 2లక్షల 40వేల ఓట్లు మాత్రమేనని,ఆయన రాష్ట్ర నాయకుడని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఘోరంగా పరాజయం కావడంతో బళ్లారి జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నాడని అన్నారు. -
భవిష్యత్‌లో మెజార్టీతో వస్తా
శివాజీనగర: ప్రజల ఆశీర్వాదంతో 12 సంవత్సరాల తరువాత విధానసౌధలోకి కాలుపెడుతున్నాను. ఇప్పుడు ప్రజలు తనను ఒక్కడిని మాత్రమే గెలిపించి పంపారు. భవిష్యత్‌లో అధిక మెజార్టీతో విధాన సౌధకు వస్తానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్నేళ్ల తరువాత మళ్లీ విధానసౌధలోకి ప్రవేశిస్తున్నాను. తమ పార్టీకి అనేక మంది ప్రజలు ఓటు వేశారు. వారి ఆశీర్వాదంతో విధానసౌధలోకి ప్రవేశించాను. ప్రజోపయోగ పనులకు తన మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో ప్రజలకు అనుకూలమైన బిల్లు ప్రవేశపెట్టడంలో తన మద్దతు తప్పకుండా ఉంటుంది. ఎవరికి తన అవసరం ఉంటుందో వారికి తన మద్దతు ఇస్తానన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న సుధామూర్తి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి
-
మీ అభిమానం చూస్తే తప్పకుండా గెలుస్తాననే నమ్మకం : గాలి లక్ష్మీ అరుణ
సాక్షి,బళ్లారి: నగర నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇంటింటా తిరిగి ప్రచారం పూర్తి చేశామని కేఆర్పీపీ నగర అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ అన్నారు. ఆమె సోమవారం నెహ్రు కాలనీలో ఇంటింటా ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. కేఆర్పీపీ గుర్తు పుట్‌బాల్‌ను ప్రతి ఓటరుకు తెలియజేసేలా ప్రచారం చేశామన్నారు. ప్రతి చోట ప్రజలు తనను వారి ఇంటి ఆడపడుచులా భావించి ఒడినింపారన్నారు. వారు చూపిన అభిమానం చూస్తే తప్పకుండా తాను గెలుస్తాననే నమ్మకం ఏర్పడిందన్నారు. గతంలో తన భర్త గాలి జనార్దనరెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో చేసిన అభివృద్ధి పనులను నేటికీ జనం తలుచుకుంటున్నారన్నారు. ఆయనతోనే నగరాభివృద్ధి సాధ్యమనే విశ్వాసం వారిలో ఉందన్నారు. తాను గెలిచిన తర్వాత మౌలిక సదుపాయాలతో పాటు గుడిసె లేని నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. . -
కర్ణాటకలో కొత్త పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి..
-
గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి మూవీ టైటిల్ ఇదే
కన్నడ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి వారసుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు. రాధాకృష్ణన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు రవిచంద్రన్, జెనీలియా, నితేష్ దేశ్‌ముఖ్, శ్రీలీల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి చిత్రం ఫేమ్ సెంథిల్‌కుమార్ చాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి ఫిలిమ్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి కథానాయకుడిగా పరిచయం అవుతున్న కిరీటికి ఆశీస్సులు అందించారు. శ్రమకు గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నా రు. కాగా గురువారం నటుడు కిరీటి పుట్టినరోజు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిరీటి కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర టైటిల్ ప్రకటించారు. దీనికి జూనియర్ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోందని దర్శకుడు తెలిపారు. -
మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి పాజిటివ్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (53) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్దారించారు. తనకు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు గాలి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో 2015 నుంచి.. షరతులతో కూడిన బెయిల్ మీదున్నారు. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీం కోర్టు నుంచి రెండు రోజుల పాటు అనుమతి తీసుకున్నారు. కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరడం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
చెట్టెక్కి మామిడి కాయలు కోసిన గాలి
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సరదాగా మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసి భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పంచి పెట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గాలి జనార్ధనరెడ్డి ఇటీవల తన మామ పరమేశ్వరరెడ్డిగారి ఊరైన కర్నూలు జిల్లా కాకనూరుకు భార్య సమేతంగా వెళ్లారు. తన మామకు చెందిన మామిడి తోటకు వెళ్లి సరదాగా గడిపారు. బాల్యంలో చెట్లు ఎక్కిన ఘటనలను గుర్తు చేసుకొని ఆ మధురమైన జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. అనంతరం స్వయంగా మామిడి చెట్టు ఎక్కారు. భార్యను కూడా చెట్టు ఎక్కించి సరదాగా గడిపారు. అనంతరం మామిడి పండ్లను కోసి అందరికీ పంచి పెట్టారు. వీడియో తీసిన ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. -
‘గాలి’ ప్రచారానికి వీల్లేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బళ్లారి నియోజకవర్గంలో జనార్దన్ సోదరుడు సోమశేఖర రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తరపున బళ్లారిలో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాలి జనార్దన్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెయిల్ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దానిని తిరస్కరించింది. మైనింగ్ కేసులో గాలికి సుప్రీంకోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదన్న నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం అందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. -
గాలి జనార్దనరెడ్డికి ఊరట
రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్ చెల్లదు: కర్ణాటక హైకోర్టు సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి రాష్ట్ర హైకోర్టులో సోమవారం భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్‌లో ఉన్న దాదాపు రూ.884 కోట్ల ఆస్తులు తిరిగి ఆయనకు చేరనున్నాయి. బళ్లారి జిల్లాలో ఇనుప గనుల తవ్వకాలతో అక్రమ మార్గంలో ఆస్తులు సంపాదించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి ఈడీ గతంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.884 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ గాలి జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. ముఖర్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది.