
మామిడి చెట్టుపై గాలి జనార్ధనరెడ్డి దంపతులు
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సరదాగా మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసి భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పంచి పెట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గాలి జనార్ధనరెడ్డి ఇటీవల తన మామ పరమేశ్వరరెడ్డిగారి ఊరైన కర్నూలు జిల్లా కాకనూరుకు భార్య సమేతంగా వెళ్లారు. తన మామకు చెందిన మామిడి తోటకు వెళ్లి సరదాగా గడిపారు. బాల్యంలో చెట్లు ఎక్కిన ఘటనలను గుర్తు చేసుకొని ఆ మధురమైన జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. అనంతరం స్వయంగా మామిడి చెట్టు ఎక్కారు. భార్యను కూడా చెట్టు ఎక్కించి సరదాగా గడిపారు. అనంతరం మామిడి పండ్లను కోసి అందరికీ పంచి పెట్టారు. వీడియో తీసిన ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment