ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిపై నారా భరత్‌రెడ్డి ధ్వజం - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిపై నారా భరత్‌రెడ్డి ధ్వజం

Published Mon, Aug 28 2023 12:30 AM | Last Updated on Mon, Aug 28 2023 7:32 AM

- - Sakshi

సాక్షి,బళ్లారి: రెండు రోజులు క్రితం బళ్లారి నగరంలోని కేఆర్‌పీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాలు జరిగిన రోజున వర్చువల్‌ ద్వారా మాజీ మంత్రి,గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ కేఆర్‌పీపీ కార్యకర్తలకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించిన తరణంలో బళ్లారినగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.

ఆయన ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతూ ఎంతంత బడా బాబులకే భయపడలేదు. ... వస్తే మేము భయపడుతామా? అని అన్నారు. రాష్ట్రంలో కేఆర్‌పీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 2లక్షల 40వేల ఓట్లు మాత్రమేనని,ఆయన రాష్ట్ర నాయకుడని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఘోరంగా పరాజయం కావడంతో బళ్లారి జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నాడని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement