
మా ఓటు మీకే అని అభ్యర్థిని లక్ష్మీఅరుణని హత్తుకుంటున్న మహిళా ఓటరు
సాక్షి,బళ్లారి: నగర నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇంటింటా తిరిగి ప్రచారం పూర్తి చేశామని కేఆర్‌పీపీ నగర అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ అన్నారు. ఆమె సోమవారం నెహ్రు కాలనీలో ఇంటింటా ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. కేఆర్‌పీపీ గుర్తు పుట్‌బాల్‌ను ప్రతి ఓటరుకు తెలియజేసేలా ప్రచారం చేశామన్నారు. ప్రతి చోట ప్రజలు తనను వారి ఇంటి ఆడపడుచులా భావించి ఒడినింపారన్నారు.
వారు చూపిన అభిమానం చూస్తే తప్పకుండా తాను గెలుస్తాననే నమ్మకం ఏర్పడిందన్నారు. గతంలో తన భర్త గాలి జనార్దనరెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో చేసిన అభివృద్ధి పనులను నేటికీ జనం తలుచుకుంటున్నారన్నారు. ఆయనతోనే నగరాభివృద్ధి సాధ్యమనే విశ్వాసం వారిలో ఉందన్నారు. తాను గెలిచిన తర్వాత మౌలిక సదుపాయాలతో పాటు గుడిసె లేని నగరంగా తీర్చిదిద్దుతానన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment