రాయ్‌‘బరి’లో సోనియా నామినేషన్ | Roy 'ring' in the nomination of Sonia | Sakshi
Sakshi News home page

రాయ్‌‘బరి’లో సోనియా నామినేషన్

Published Thu, Apr 3 2014 4:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాయ్‌‘బరి’లో సోనియా నామినేషన్ - Sakshi

రాయ్‌‘బరి’లో సోనియా నామినేషన్

హోమం నిర్వహించిన కాంగ్రెస్ అధినేత్రి
కంచుకోటలో ఘనస్వాగతం
తల్లి కారుకు డ్రైవర్‌గా రాహుల్

 
 రాయ్‌బరేలి/న్యూఢిల్లీ: కుమారుడు రాహుల్ గాంధీ తోడురాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడు సతీశ్ శర్మ, సోనియా ప్రతినిధి కేఎల్ శర్మ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో సంక్షిప్తంగా మాడ్లాడిన సోనియా.. ఇక్కడి ప్రజలు అపారమైన అనురాగాన్ని చూపిస్తూ తమలో ఒకరిగా తనను భావిస్తున్నారని చెప్పారు. ఈ సారి కూడా తనకు విజయాన్ని కట్టబెడతారన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సోనియా, రాహుల్ స్థానిక పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. కాగా, ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన సోనియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. సోనియా ప్రయాణించిన వాహనానికి రాహుల్ డ్రైవర్‌గా వ్యవహరించారు.

 అదో పెద్ద జోక్: ముస్లిం వర్గాన్ని ప్రభావితం చేసి గంపగుత్తగా ఓట్లు సాధించేందుకే ఢిల్లీలో జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీని కలిశారని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఓ పెద్ద జోక్‌గా సోనియా అభివర్ణించారు. తనకు అలాంటి అలవాటు లేదని, ఓట్లను ఆకర్షించే ఆటలు కూడా ఆడనని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత సోనియా ముస్లిం మత పెద్దలను కలిశారు. అయితే అలా మత పెద్దలను కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని బీజేపీ మండిపడింది.
 
మరికొంత మంది ప్రముఖులు కూడా..

 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు ఎ.రాజా నీలగిరి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పించారు. రాజా తన ఆస్తులను రూ. 1.77 కోట్లుగా చూపారు. ముంబై వాయవ్య స్థానానికి ఎంఎన్‌ఎస్ తరఫున దర్శకుడు మహేశ్ మంజ్రేకర్,  కేంద్ర మంత్రి నమోనారాయణ్ మీనా దౌసా స్ధానానికి నామినేషన్లు దాఖలు చేశారు.
 
 ఆరు రెట్లు పెరిగిన ఆస్తులు

 నామినేషన్‌తోపాటు ఆస్తులకు సంబంధించి సోనియా ఇచ్చిన అఫిడవిట్‌లో తనకు రూ. 9 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. దీంట్లో స్థిరాస్తులు రూ. 6. 47 కోట్లు, చరాస్తులు రూ. 2.81 కోట్లుగా చూపించారు. 2009లో పేర్కొన్న తన ఆస్తి రూ. 1.37 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆస్తుల విలువ ఆరు రెట్లు పెరిగింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇస్తూ.. గతంలో పుస్తక విలువ ఆధారంగా, ఈసారి మాత్రం మార్కెట్ విలువల ఆధారంగా చూపడం వల్ల ఆస్తులు పెరిగాయన్నారు. ఈ అఫిడవిట్‌లో తన పేర ఒక్క కారు కూడా లేదని సోనియా చెప్పారు. ఈ తన ఆదాయం రూ. 14.21 లక్షలని, రాహుల్‌కు రూ. 9 లక్షలు అప్పుగా ఇచ్చానని చెప్పారు. చరాస్తుల్లో నగదు రూ. 85 వేలు, బ్యాంకుల్లో రూ. 66 లక్షలు, బాండ్లు రూ. 10 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్ రూ. 82.20 లక్షలు, పీపీఎఫ్ రూ. 42.49 లక్షలు, నగలు రూ. 62 లక్షలుగా చూపార
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement