శ్మశానంలో రూ.20 లక్షల నగదు | Rs 20 lakh cash in Cemetery | Sakshi
Sakshi News home page

శ్మశానంలో రూ.20 లక్షల నగదు

Published Tue, Dec 20 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

శ్మశానంలో రూ.20 లక్షల నగదు

శ్మశానంలో రూ.20 లక్షల నగదు

బొమ్మనహళ్లి(బెంగళూరు): ఏటీఎంలో పెట్టాల్సిన రూ.20 లక్షల నగదున్న ట్రంక్‌ పెట్టెను, వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్‌ సెబన్ హుస్సేన్ కోసం సిటీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతను మడివాళలో ఉన్న సెక్యూర్‌ వాల్యూ ఇండియా అనే సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఇక్కడి కోరమంగళలో అద్దెకు దిగిన ఇంటి చిరునామా, అసోంలోని ఒక చిరునామాను సంస్థకు ఇచ్చాడు. ఆదివారం రాత్రి పోలీసులు కోరమంగళ అడ్రస్‌కు వెళ్లగా అక్కడ దొరకలేదు.

దీంతో సొంత రాష్ట్రం అసోంకు వెళ్లి ఉంటాడని పోలీసు ప్రత్యేక బృందం అక్కడకు బయల్దేరింది. శనివారం సాయంత్రం వాహనంతో పాటు రూ.20 లక్షల నగదున్న పెట్టెను ఎత్తుకెళ్లిన అతను.. వాహనాన్ని యమళూరు చెరువు వద్ద, డబ్బు ఉన్న పెట్టెను బెళ్లండూరు సర్కిల్‌ వద్ద ఉన్న శ్మశానం వద్ద ఆదివారం వదిలివెళ్లాడు. పోలీసులు పెట్టె తెరిచి చూడగా భారీగా డబ్బు బయటపడింది. ఏటీఎం ల్లో పెట్టాల్సిన డబ్బును అతను దొంగిలించడానికి యత్నించాడని, పట్టుబడతాననే భయంతోనే వదిలేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement