తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రాంగణంలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రీ చితిర అట్ట తిరునాళ్ పూజ నిమిత్తం నేడు(మంగళవారం) మరోసారి శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న మహిళలను, మీడియాను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. ఈ ఘటనలో ఓ వీడియో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. త్రిసూరుకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కొంతమంది నిరసనకారులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా తనను ఆలయంలోకి ప్రవేశించకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆమె ప్రతిఘటించడంతో వారు మరింత రెచ్చిపోయారు. తన వయస్సు 52 ఏళ్లు అని పేర్కొనడంతో, తాను కచ్చితంగా దర్శనం చేసుకునే తీరతానని ఆమె పట్టుబట్టారు. దీంతో నిరసనకారులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.
కాగా ట్రావెన్‌కోర్ సంస్థాన చివరి మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినం సందర్భంగా శబరిమల ఆలయాన్ని నేడు తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయ్యప్ప సన్నిధానం తెరుచుకోవడం ఇది మూడోసారి. గతనెల మాసపూజలు, నిన్న(సోమవారం) మకరవిలక్కు పూజ సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment