శబరిమల/తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల చేరుకున్న శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు బుధవారం అయ్యప్ప సన్నిధికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిబంధలనకు విరుద్దంగా స్వామి దీక్ష ముసుగులో నల్లని దుస్తులు ధరించి వారు దర్శనం చేసుకున్నారని అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంతో కేరళ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా, మండలదీక్ష ఆచరిస్తున్న శశికళను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. మెడికల్ సర్టిఫికెట్‌తో పాటు దర్శనానికి వచ్చినా అనుమతి నిరాకరించటంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళను అడ్డుకోవడం పట్ల రాష్ట ప్రభుత్వంపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment