కరవు గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్
న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని దోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ ఈసారి కరవు బాధిత గ్రామమైన దోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా ఆయన ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ సభ్యుడు రెండు గ్రామాలను దత్తత తీసుకోవాల్సి ఉంది.