న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఘాలు చేసిన న్యాయమైన సూచనలను ఏడో వేతన సంఘం ఆమోదించలేదని గుర్తించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు తాజాగా వేతన సవరణ డిమాండ్లను చేయవచ్చు. ఇటువంటి డిమాండ్లను కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని కార్యదర్శుల సాధికార కమిటీకి సచివాలయంగా పనిచేసేందుకు ఆర్థికశాఖ నియమించిన అమలు విభాగానికి నివేదించవచ్చు.
ఇంప్లిమెంటేషన్ సెల్ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలపై ఇటీవల ఏడో వేతన సంఘం సమర్పించిన నివేదికలోని సిఫారసులను పరిశీలించి కేబినెట్ ఆమోదం కోసం పటిష్టపరచేందుకు సీఓఎస్ ఏర్పాటైన విషయం తెలిసిందే.