
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మోదీపై ఆరెస్సెస్ నేత ఒకరు చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు.
మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారని, ఆయనను చేతితో తొలగించలేరని, చెప్పుతో కొట్టలేరని సదరు ఆరెస్సెస్ నేత ఓ జర్నలిస్టుతో చెప్పుకొచ్చారని శశి థరూర్ పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment