ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : వివాహ సమయంలో పెట్టే ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి సిఫారసు చేసింది. వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు సంయుక్తంగా ఖర్చు వివరాలను వివాహ ధ్రువీకరణ అధికారి వద్ద నమోదు చేసేలా నిబంధన తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తద్వారా వరకట్న దురాచారాన్ని రూపుమాపడంతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులను నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
వివాహ సమయంలో చేసే ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్ చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని వ్యాఖ్యానించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందున్న చట్టాల్లో సవరణలు చేయాల్సిందిగా కోరింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment