న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు కోసం ఫ్రెంచి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ‘సీల్డు కవర్’లో అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాఫెల్ ఒప్పందం అమలుపై స్టే విధించాలంటూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్ణయించింది. భారత్, ఫ్రెంచి కంపెనీ డసో మధ్య కుదిరిన రూ.58వేల కోట్ల రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రధానిపై అవమానకరమైన, నీతిబాహ్యమైన రీతిలో ఆరోపణలు చేస్తున్నాయని పిటిషనర్ లాయర్ వినీత్ ధండా పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదానికి తెరదించాలని సుప్రీంకోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment