
మైసూరులో ప్యాలెస్‌కు సమీపంలో సొరంగ మార్గం
బెంగళూరు : రాచనగరి మైసూరులో ప్యాలెస్‌కు సమీపంలో ఓ భారీ సొరంగ మార్గం బయటపడింది. విశ్వమానవ పార్క్ వద్ద రోడ్డు పనులు చేస్తుండగా బుధవారం ఈ సొరంగం వెలుగు చూసింది. దాదాపు మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తులో అర కిలోమీటరు పొడవున్న ఈ సొరంగం గన్‌హౌస్ నుంచి ప్యాలెస్‌కు చేరుకుంటుంది.
ఈ సొరంగ మార్గాన్ని గతంలో రాజులు రహస్య మార్గంగా వాడుకున్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.