
నేడు గుర్మీత్ హత్య కేసుల విచారణ
ఛండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్‌పై రెండు వేర్వేరు హత్య కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంచకులలో భారీగా భద్రతాబలగాలను మోహరించారు. హరియాణా డీజీపీ బి.ఎస్.సంధూ మాట్లాడుతూ..గుర్మీత్ రోహ్‌తక్‌లోని జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని వెల్లడించారు. డేరాలో దారుణాలపై వచ్చిన లేఖను విలేకరి రామ్‌చందర్ తన పత్రికలో ప్రచురించడంతో హత్యకు గురయ్యారు. లేఖను పంపినట్లు భావిస్తున్న డేరా మేనేజర్ రంజిత్ సింగ్‌ను కూడా అదే ఏడాది హత్య చేశారు.