Gurmeet Singh
-
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా గుర్మీత్ సింగ్ ప్రమాణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్, డీజీపీ అశోక్ కుమార్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. గుర్మీత్ సింగ్ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సైనికుడిగా సేవలందించాక, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా పని చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికుడు ఉన్నాడని, అందుకే రాష్ట్రానికి వీరభూమి అనే పేరుందని అన్నారు. రిటైర్ అయిన సైనికులు, ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారిపై ఆధారపడిన వారికి కుటుంబాలకు సాయం అందించడం తన ప్రాధమ్యమని చెప్పారు. గవర్నర్ కార్యాలయం ద్వారా ప్రజల అంచనాలను పెంచుతానని వ్యాఖ్యానించారు. -
డేరా బాబాను కాపాడేందుకు దిగ్గజ లాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌథ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన ఆశ్రమంలో పలువురిని సామూహికంగా నపుంసకులుగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తనకు మద్దతుగా వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆరుషి హత్య కేసులో తల్వార్లకు విముక్తి కల్పించిన లక్నోకు చెందిన న్యాయవాదులు తన్వీర్ అహ్మద్ మిర్, ధ్రువ్ గుప్తాలు ఈ కేసులో డేరా బాబా తరపున వాదనలు వినిపించనున్నారు. డేరా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్, ఇద్దరు వైద్యుల సాయంతో దాదాపు 400 మంది డేరా అనుచరులను బలవంతంగా వృషణాలు తొలగించడం ద్వారా నపుంసకులుగా మార్చారని సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 1న డేరా బాబాపై చార్జిషీట్ నమోదు చేసింది. వైద్యులు పంకజ్ గార్గ్, ఎంపీ సింగ్‌ల సహకారంతో గుర్మీత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని సీబీఐ ఆరోపిస్తోంది. పంచ్‌కుల ప్రత్యేక న్యాయస్ధానంలో డేరా బాబాపై సీబీఐ ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు గుర్మీత్ సింగ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. -
ఎట్టకేలకు హనీప్రీత్ అరెస్ట్
-
కాలు కాలిన పిల్లిలా బాబా గుర్మీత్..
సాక్షి, న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దాదాపు 20 రోజులుగా రోహతక్‌లోని సునేరియా జైల్లో ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. భోగ విలాసాలకు దూరమవడంతో నిద్ర పట్టక జైలు గదిలో ఒంటరిగా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని జైలు అధికారులు తెలిపారు. గుర్మీత్‌పై దాఖలైన రెండు హత్య కేసుల్లో శనివారం నాడు చండీఘర్ సమీపంలోని పంచకుల కోర్టులో విచారణ జరిగినప్పటికీ భద్రతా కారణాల రీత్య ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లలేదు. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం కల్పించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఎప్పుడూ 40 మోటారు వాహనాల వరుస ముందుగా కదులుతుంటే, తన వెనకాల వందలాది మంది శిష్యబృందం కదిలివస్తుండగా, రాజసం ఉట్టిపడే విధంగా స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లే గుర్మీత్ సింగ్‌కు ఎంత గతి పట్టిందని తోటి ఖైదీలే అనుకుంటున్నారు. తోటీ ఖైదీలు దాడి చేస్తారన్న భయంతో గుర్మీత్ జైల్లో వారితో మాట్లాడడం లేదట. పొద్దస్తమానం గదిలో తనలో తాను గొనుక్కుంటూ గడుపుతున్న గుర్మీత్ అసహనంతో గదిలో అస్తమానం అటూ ఇటూ నడుస్తున్నాడట. ఆయన్ని జైల్లో సందర్శించే వారి జాబితాలో గుర్మిత్ తల్లి నసీబ్ కౌర్, కూతుళ్లు, చరణ్‌ప్రీత్, అమన్‌ప్రీత్, కుమారుడు జస్మీత్ ఇన్సాన్, మరో పెంపుడు కూతురు హనీప్రీత్‌ల పేర్లు ఉండగా, ఇప్పటి వరకు ఆయన తల్లి నసీబ్ కౌర్ ఒక్కరే జైలుకు వచ్చి ఆయన్ని పలకరించి పోయారు. డేరా సచ్ఛా సౌధాలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? అన్న ఒక్క విషయాన్నే బాబా తన తల్లిని వాకబుచేసి తెలుసుకున్నట్లు తెల్సింది. బాబా జైల్లోకి అడుగుపెట్టిన కొత్తలో తన పెంపుడు కూతురు హనీప్రీత్‌ను కలుసుకోవాలని తెగ ఆరాటపడ్డారు. అయితే ఆమెపై బాబాను తప్పించేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలతో కేసు దాఖలవడంతో ఆమె పరారీలో ఉన్నారు. హనీప్రీత్ హరియాణా దాటి వెళ్లకుండా విమానాశ్రయంలో, రాష్ట్ర సరిహద్దుల్లో తగిన హెచ్చరికలు జారీ చేసినా ఇంతవరకు ఆమె ఆచూకి వెలుగులోకి రాలేదు. హనీప్రీత్ తో కూడా బాబా లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ఆమె నుంచి విడాకులు తీసుకున్న మాజీ భర్త మీడియా ముందు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. బాబా జైల్లోకి వచ్చిన వారం రోజులకే ఓ సైకియాట్రిస్ట్ సహా డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. సెక్స్‌కు బానిసైన బాబా అది లేకపోవడం వల్ల నిద్రపోలేక పోతున్నారని సైక్రియాట్రిస్ట్ తెలిపారు. ఇప్పటికీ గుర్మిత్ నిద్రలేమితో ఆందోళనకు గురవుతున్నారని జైలు సిబ్బంది తెలిపారు. -
నేడు గుర్మీత్ హత్య కేసుల విచారణ
-
నేడు గుర్మీత్ హత్య కేసుల విచారణ
ఛండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్‌పై రెండు వేర్వేరు హత్య కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంచకులలో భారీగా భద్రతాబలగాలను మోహరించారు. హరియాణా డీజీపీ బి.ఎస్.సంధూ మాట్లాడుతూ..గుర్మీత్ రోహ్తక్లోని జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని వెల్లడించారు. డేరాలో దారుణాలపై వచ్చిన లేఖను విలేకరి రామ్‌చందర్ తన పత్రికలో ప్రచురించడంతో హత్యకు గురయ్యారు. లేఖను పంపినట్లు భావిస్తున్న డేరా మేనేజర్ రంజిత్ సింగ్‌ను కూడా అదే ఏడాది హత్య చేశారు. -
గుర్మీత్ డేరాలో సోదాలు
⇔ లగ్జరీ కారు, పాత కరెన్సీ స్వాధీనం సిర్సా: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ ఆశ్రమం డేరా సచ్ఛా సౌదాలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఏకేఎస్ పవార్ నేతృత్వంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నంబర్ ప్లేట్ లేని ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను, రూ.7 వేలు విలువైన రద్దైన నోట్లు, మరో రూ.12 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు హరియాణా సమాచార, ప్రజాసంబంధాల డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మిశ్రా మీడియాకు తెలిపారు. పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో నిర్వహించిన సోదాలను వీడియో తీసినట్లు పేర్కొన్నారు. ఆశ్రమం లో పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని గదులను సీల్ చేసినట్లు పేర్కొన్నారు. సిర్సాకు చేరుకున్న ఫోరె న్సిక్ నిపుణులు పలు ఆధారాలు సేకరించి నట్లు వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడడా నికి సిర్సాలో ఈ నెల 10 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశామ న్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికను హైకోర్టుతో పాటు హరియాణా ప్రభుత్వానికి సమర్పించ నున్నట్లు వెల్లడించారు. -
డేరాల విధ్వంసం.. రాబర్ట్ వాద్రా ఆందోళన!
న్యూఢిల్లీ: హరియానాతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధ్వంసకాండపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తీవ్రంగా స్పందించారు. డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం మద్ధతుదారులు చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ 36 మంది మృతిచెందడంతో పాటు 250కి పైగా మంది గాయపడ్డారని.. దీనికి హరియానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదివారం ఆయన డిమాండ్ చేశారు. గుర్మీత్ అనుచరుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించి, ఎన్నోసార్లు విచారణ చేపట్టి వేధించారని.. ఇంటిగ్రిటీ లేదని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హరియానాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించలేని వ్యక్తి సీఎం హోదాలో ఉండేందుకు అనర్హుడని వాద్రా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గుర్మీత్ ఆస్తులు వేలం వేసి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని పంజాబ్, హరియానా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించడాన్ని వాద్రా మెచ్చుకున్నారు. స్వేచ్ఛగా ప్రాణాలతో బతికేందుకు హరియానా ప్రజలకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే దేశంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2002లో జరిగిన అత్యాచారాల కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హరియాణలో ఆయన మద్దతుదారులు హింసాకాండను సృష్టించారు. -
టెన్షన్: డేరా ఆశ్రమంలో ఇంకా 30వేలమంది!
సిర్సా: హరియాణలోని సిర్సా పట్టణంలో ఇంకా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాజధాని చండీగఢ్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్సా పట్టణంలో ఉన్న డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమంలో 30వేల మంది గుమిగూడి ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వెయ్యి ఎకరాల ఆశ్రమంలో తిష్టవేసిన 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు ఆశ్రమం వీడి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, సైన్యం ఆశ్రమాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఆశ్రమంలోని వారు వెంటనే బయటకు రావాలని సందేశం పంపుతున్నా.. లోపలున్న డేరా మద్దతుదారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 15 ఏళ్ల కిందటి లైంగిక దాడి కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో హరియాణలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి తెగబడి.. హింసాకాండను సృష్టించారు. ఈ నేపథ్యంలో రోహతక్‌లోని జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించబోతున్నారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో రోహతక్‌లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరోవైపు గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా దళాలు హరియాణ అంతటా పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో సిర్సాలోని గుర్మీత్ ఆశ్రమంలో 30వేలమంది పొంచి ఉండటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. -
డేరా కమామిషు!
69 ఏళ్ల చరిత్ర.. గుర్మీత్ బాధ్యతలు చేపట్టాకే వివాదాలు మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన డేరా సచ్ఛా సౌదా(డీఎస్ఎస్)కు 69 ఏళ్ల చరిత్ర ఉంది. డీఎస్ఎస్కు గుర్మీత్ నాయకత్వం చేపట్టినప్పటి నుంచి దీని నడక కొత్త పుంతలు తొక్కింది. డేరాల నేపథ్యం హిందూ ఆశ్రమాల మాదిరిగా పనిచేసే ఆధ్యాత్మిక కేంద్రాలను అవిభక్త భారత్‌లోని పంజాబ్, సింధ్, ఫక్తూనిస్తాన్లలో డేరాలుగా పిలుస్తారు. పంజాబ్‌లో అతిపెద్దది, మొదటిది అయిన డేరా రాధాస్వామీ సత్సంగ్ బియాస్‌ను 1891లో ప్రారంభించారు. పంజాబ్, హరియాణాలో 9000కుపైగా డేరాలున్నాయని ఓ అంచనా. డేరా రాధాస్వామీ సత్సంగ్తోపాటు డీఎస్ఎస్, డేరా నూర్మహల్, డేరా సచ్‌ఖండ్ బలాన్, డేరా నిరంకారీ, డేరా నాంధారీ ఎక్కువ మంది అనుచరులున్న డేరాలు. రోజూవారీ జీవితంలో తాము ఎదుర్కొంటున్న అగ్రవర్ణాల ఆధిపత్యం డేరాల్లో లేకపోవడం బడుగువర్గాలకు నచ్చింది. తమకు తాముగా పీఠాధిపతిగా ప్రకటించుకుని, భక్తుల కోసం ప్రసంగాలు, ప్రవచనాలు చేసే గురువులు, బాబాలు ఈ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి డేరాలు ప్రారంభించారు. డీఎస్ఎస్ స్థాపన, విస్తరణ.. మస్తానా బలూచీ అనే క్షత్రియ సన్యాసి అవిభక్త పంజాబ్ (ప్రస్తుత హరియాణా)లోని సిర్సాలో డీఎస్ఎస్ను స్థాపించారు. 1948–60 మధ్యకాలంలో ఇక్కడ నామ్ శపథ్ అనే ధ్యానం ఎలా చేయాలో మస్తానా బోధించారు. డీఎస్ఎస్ తర్వాతి అధినేత అయిన సత్నామ్సింగ్ డేరాను 1960 నుంచి 1990 మధ్య విస్తరించారు. 1990 ఏప్రిల్‌లో గుర్మీత్ అధిపతి అయ్యారు. డేరా వెబ్సైట్లో బాబా గుర్మీత్ పేరును సెయింట్ డాక్టర్ గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ ఇన్సాన్‌గా ప్రస్తావించడమేగాక ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల మంది అనుచరులున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా ముఖ్య పట్టణమైన సిర్సాలో వెయ్యి ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందీ డీఎస్ఎస్ ప్రధానకేంద్రం. దీనిలో హొటెల్, సినిమాహాలు, క్రికెట్ మైదానం, క్రీడా గ్రామం, స్టూడియో, బయోగ్యాస్ ప్లాంట్ ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా బాబాను కలవడం అసాధ్యం. డేరా వెలుపల బాబా గుర్మీత్ అనుచరులు నడిపే 40 దుకాణాలున్నాయి. ఆకర్షిస్తున్న డేరా కార్యక్రమాలు దేశంలోనూ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ వంటి ఇతర దేశాల్లో కలిపి డీఎస్ఎస్కు 46 ఆశ్రమాలున్నాయి. డీఎస్ఎస్ చేపట్టే అనేక సేవా కార్యక్రమాలు లక్షలాది అనుచరులను ఆకట్టుకుంటున్నాయి. డేరా రెండో గురువు పేరిట సత్నామ్జీ గ్రీన్–ఎస్ వేల్ఫేర్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయం అందిస్తున్నారు. కోల్‌కతా అగ్నిప్రమాదం, జలంధర్ ఫ్యాక్టరీ ప్రమాదం, ఉత్తరాఖండ్ వరదల్లోనూ సంస్థ తరఫున వందలాది మంది వైద్యులు, వలంటీర్లు పనిచేశారు. రాజకీయ క్రీ‘డేరా’! దేశంలో స్వయం ప్రకటిత స్వామిజీలు, బాబాలు, గురువులతో అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల బంధం విడదీయరానిదిగా మారుతోంది. ఇందుకు గుర్మీత్ సింగ్ మినహాయింపేం కాదు. ఇతనికి కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం, న్యాయస్థానం దోషి అని తేల్చాక కూడా ప్రధాన పార్టీల నేతలు స్పందించకపోవడాన్ని బట్టి డేరా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దళిత, బీసీల ఓట్ల కోసమే... పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో నిమ్న తరగతులకు చెందినవారు పెద్దసంఖ్యలో డేరా అనుచరులున్నారు. వారి ఓట్లను పొందేందుకే రాజకీయపార్టీలు డేరా మద్దతు కోసం పోటీపడుతున్నాయి. 2014లో బీజేపీకి మొదలైన డేరా మద్దతు లోక్‌సభ ఎన్నికలు, హరియాణా అసెంబ్లీ ఎన్నికల వరకు, ఆ తర్వాతా కొనసాగుతోంది. డేరా వర్గం ఓట్లు అటు కేంద్రంలో ఇటు హరియాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు తోడ్పడ్డాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణాకు వచ్చిన నాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని మోదీ సిర్సా బహిరంగసభలో, అంతకు పూర్వం పాల్గొన్న సభల్లోనూ, గుర్మీత్‌ను కీర్తించారు. గతంలోనే అమిత్ షా, పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అనేక మంది నాయకులు డేరా కేంద్రాన్ని సందర్శించారు.గుర్మీత్‌ను దోషిగా తేల్చిన శుక్రవారానికి పదిరోజుల ముందు... ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు కార్యక్రమానికి హరియాణా విద్యా శాఖ మంత్రి రాంవిలాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డేరాలో క్రీడల ప్రోత్సాహం పేరుతో తన శాఖ నిధుల నుంచి మంత్రి రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. భారత యోగా ఫెడరేషన్ ఇటీవల క్రీడల్లో గురువులకిచ్చే ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య’ అవార్డుకు డేరా చీఫ్ పేరును సిఫార్సు చేసింది. గుర్మీత్ది ‘గొప్ప ఆత్మ’ (నోబుల్ సోల్) అని శుక్రవారం బీజేపీ నేత సాక్షి మహారాజ్ కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గుర్మీత్ సింగ్‌పై కేసులు.. ► తనతో విభేదించిన డేరా మేనేజర్ రంజిత్‌సింగ్ హత్యకు గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ 2002 జూలైలో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. డేరా ప్రధాన కేంద్రం సిర్సాలో సాధ్వీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రంజిత్‌సింగ్ ఆకాశరామన్న లేఖలు పంపిణీ చేశాడని అనుమానించారు. ► డేరా ప్రధాన కార్యాలయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ వార్తా కథనాలు రాసిన సిర్సాకు చెందిన రాంచందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడు 2002 అక్టోబర్ 23న హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ప్రమేయముందంటూ గుర్మీత్‌తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ► 2014 డిసెంబర్ 23న డేరా ప్రధాన కేంద్రంలో గుర్మీత్ తన అనుయాయులైన 400 మంది వృషణాలను నొక్కేసి నిర్వీర్యులను చేశారన్న ఆరోపణలపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. ► సిక్కుల మతగురువు గురు గోవింద్ సింగ్ మాదిరిగా గుర్మీత్ దుస్తులు ధరించారంటూ 2007లో భటిండా పోలీసులు కేసు నమోదు చేశారు. ► సిర్సాలో డేరా కార్యకర్తలకు ఆయు«ధ శిక్షణనిస్తున్నారంటూ భారత సైన్యం పేర్కొంది. ఆయుధ శిక్షణపై పరిశీలన జరిపి వివరాలు తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులిచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎవరీ గుర్మీత్?
రాజస్తాన్‌లోని గంగానగర్ జిల్లాలోని శ్రీ గురుసార్ మోడియా గ్రామం గుర్మీత్ స్వస్థలం. జాట్ సిక్కు, సంపన్న రైతు మఘర్ సింగ్, నసీబ్ కౌర్‌ల ఏకైక సంతానం.1967 ఆగస్టు 15న గుర్మీత్ పుట్టారు. డేరా సచ్చా సౌదా మతగురువు షా సత్నామ్... గుర్మీత్‌ను ఏడేళ్ల వయసులోనే తనతో తీసుకెళ్లి సచ్చా సౌదాలో చేర్పించారు. పేరును గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌గా మార్చారు. గుర్మీత్‌కు 23 ఏళ్ల వయసు ఉన్నపుడు మత గురువు హోదాను ప్రసాదించి సెప్టెంబర్ 23, 1990లో తన వారసుడిగా ప్రకటించారు షా సత్నామ్. గుర్మీత్‌కు భార్య హర్జీత్ కౌర్, కొడుకు జస్మీత్, కూతుళ్లు చరణ్‌ప్రీత్, అమర్‌ప్రీత్ ఉన్నారు. హనీప్రీత్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. హనీప్రీత్ పంజాబీ సినీనటి, దర్శకురాలు. గుర్మీత్ సహా కుటుంబంలో అందరి పేరు చివరన ‘ఇన్సాన్ (మనిషి)’ అనే పదం ఉంటుంది. సకల కళావల్లభుడు గుర్మీత్ వేషధారణ రాక్‌స్టార్‌ను తలపిస్తుంది. జిగేల్మని మెరిసిపోయే ఆభరణాలు, వస్త్రధారణతో కనిపిస్తుంటారు. చలువ కళ్లజోడు, టీషర్టులు, రంగురంగుల చొక్కాలతో కనిపిస్తారు. ఆధ్యాత్మిక గురువు, దానశీలి, గాయకుడు, ఆల్‌రౌండర్ క్రీడాకారుడు, సినిమా దర్శకుడు, నటుడు, ఆర్ట్ డైరెక్టర్, సంగీత దర్శకుడు, రచయిత, గేయ రచయితగా ట్వీటర్ ప్రొఫైల్‌లో రాసుకున్న గుర్మీత్‌ను సకల కళావల్లభుడిగా చెప్పొచ్చు. ట్వీటర్లో ఆయనకు 37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వయంగా పాటలు రాసి, సంగీతం సమకూర్చి ఆల్బమ్స్ విడుదల చేస్తుంటారు. ఆధునిక సంగీతం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నానని చెప్పుకుంటారు. యూనివర్సల్ లేబుల్ కింద పాటల ఆల్బమ్స్‌ను విడుదల చేస్తుంటారు. 2014లో వచ్చిన హైవే లవ్ చార్జర్ ఆల్బమ్ మూడురోజుల్లోనే 30 లక్షల కాపీలు అమ్ముడైంది. సంగీత ప్రదర్శనలూ ఇస్తుంటారు. దేశంలోని వివిధ నగరాల్లో ఆయన ‘రు–బా–రు నైట్స్’ పేరిట వంద ప్రదర్శనలు ఇచ్చారు. రచన– దర్శకత్వం– స్క్రీన్ ప్లే– మాటలు– పాటలు సినిమాల్లోనూ గుర్మీత్‌కు ఆసక్తి మెండు. తన సినిమాల్లో తానే హీరో, తానే దర్శకుడు, కథ, మాటలు, పాటలు... ఇలా అన్నీ తానే. మెసెంజర్ ఆఫ్ గాడ్ (ఎంఎస్‌జీ) పేరిట రెండు సినిమాలను 2015లో తీశారు. దుష్టశక్తులు, గ్రహాంతరవాసుల నుంచి మానవాళిని కాపాడే గురూజీ పాత్రలో గుర్మీత్ నటించారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులను నడుపుతారు. తర్వాత ఎంఎస్‌జీ: ద వారియర్ లయన్హర్ట్, హింద్ కా నపాక్కో జవాబ్, జట్టూ ఇంజనీర్... అనే మూడు సినిమాలను తీశారు. దేశవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ఈయన సినిమాలు విడుదలవుతుంటాయి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈయన పేరుంది. ఎందుకో తెలుసా.. ఒక సినిమాలో అత్యధిక బాధ్యతలు నిర్వర్తించినందుకు. ఎంఎస్‌జీ–2 సినిమాకు గుర్మీత్ ఏకంగా 43 బాధ్యతలు నిర్వర్తించాడు. అకల్తక్త్తో వివాదం సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్‌ను పోలిన వస్త్రధారణ చేయడం ద్వారా సిక్కుల ఆగ్రహానికి గురయ్యారు గుర్మీత్. 2007లో జరిగిన ఈ సంఘటన సిక్కులకు, గుర్మీత్ అనుయాయులకు మధ్య ఉద్రిక్తతల కారణంగా ఘర్షణలు జరిగాయి. సిక్కుల మనోభావాలను దెబ్బతీశాడని కేసు నమోదైంది. మధ్యవర్తులు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో గుర్మీత్ ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పినా సిక్కుల మత వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత మండలి ‘అకల్తక్త్’ సంతృప్తి చెందలేదు. క్షమాపణ సరిగా కోరలేదని అభిప్రాయపడింది. 2015 సెప్టెంబర్ 27న క్షమాపణను అంగీకరించినా సిక్కుల వ్యతిరేకతతో మళ్లీ ఉపసంహరించుకుంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ మనోభావాలను దెబ్బతీశాడని రగిలిపోయిన సిక్కు యువకులు 2007 జూలై 16న గుర్మీత్‌పై దాడి చేశారు. దీని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 2008లో ఆయన కాన్వాయ్‌పై బాంబుదాడి జరిగింది. ఇందులో గుర్మీత్‌కు ఏమీ కానప్పటికీ 11 మంది అనుయాయులు గాయపడ్డారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. జడ్ ప్లస్‌లో 36 మంది సుశిక్షితులైన కమాండోలను భద్రత నిమిత్తం కేటాయిస్తారు. విలాసవంతమైన జీవనశైలి ఖరీదైన కార్లపై మోజు. బుల్లెట్ ప్రూఫ్ లెక్సస్, మెర్సిడెజ్ ఎస్‌యూవీల్లో తిరుగుతుంటారు. చిత్రమైన కార్లను డిజైన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా మందీమార్బలంతో తరలివెళతారు. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. డేరా సచ్చా సౌదాకు దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. డేరా ఆస్తులు కాకుండా గుర్మీత్ వ్యక్తిగత సంపద విలువ... 250 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డేరా విధ్వంసకాండ
- తగలబడ్డ హరియాణా, పంజాబ్ - 36 మంది మృతి.. 269 మందికి గాయాలు పంచకుల/చండీగఢ్/న్యూఢిల్లీ: హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు భగ్గుమన్నాయి. డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను రేప్‌కేసులో శుక్రవారం సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించటంతో ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు. వీరి విధ్వంసకాండతో రెండు రాష్ట్రాల్లో 36 మంది చనిపోగా.. 269 మంది గాయపడ్డారు. డేరా అభిమానులు పెట్రోలు బాంబులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. పంచకులలో వీరి ఉన్మాదానికి కనబడ్డ వస్తువల్లా అగ్నికి ఆహుతైంది. రైలు, బస్సు, కారు, బైక్ అనే తేడా లేకుండా ప్రతి వాహనాన్నీ అన్యాయంగా తగలబెట్టేశారు. భవనాలనూ ఆందోళనకారులు వదల్లేదు. పంచకులలో ఎటుచూసినా వాహనాలను తగులబెట్టిన అగ్నికీలలే ఎగిసిపడ్డాయి. తమ ఉన్మాదాన్ని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. మొత్తంగా హరియాణాలోని పంచకుల, సిర్సాలతోపాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ అల్లర్లలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ శివార్లలో డేరా ఉన్మాదులు ఓ రైలు బోగీని తగులబెట్టారు. రాజస్తాన్‌లోనూ ప్రభుత్వ వాహనాలు, శ్రీ గంగానగర్ జిల్లాలో లేబర్ కోర్టు సహా రెండు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుబెట్టారు. డేరాల ప్రాబల్యమున్నచోట.. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలోనూ 32 దాడి కేసులు నమోదయ్యాయి. డేరా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మాన్సా, బతిండా, ఫిరోజ్‌పూర్, పటియాలా, బర్నాలా, ఫరీద్కోట్ ప్రాంతాలతోపాటుగా హరియాణాలోని పంచకుల, సిర్సాతోపాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ (144 సెక్షన్) విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పంజాబ్‌లోని మాన్సాలో ఆదాయపన్ను శాఖ భవనాన్ని తగులబెట్టగా.. మిగిలిన చోట్ల రైళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, భవనాలకు నిప్పంటించారు. మోగా, ఫిరోజ్‌పూర్ మధ్యనున్న దాగ్రు రైల్వే స్టేషన్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పంచకులలో విధ్వంసం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసంతోపాటుగా మూడు టీవీచానెళ్ల ఓబీ వ్యాన్లను తగులబెట్టారు. రెండింటిని ధ్వంసం చేశారు. ఓ చానెల్ వాహనంపై దాడిచేయటంతో కెమెరామెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినా విధ్వంసం ఆగలేదు. డేరా కార్యాలయాల్లో సోదాలు కోర్టు ఆదేశాలతో సిర్సాతోపాటుగా హరియాణాలోని డేరా ప్రధాన కార్యాలయంతోపాటుగా 30 వేర్వేరు కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న అనుచరులు, భక్తులను పంపించేశారు. ఈ సోదాల్లో ఓ ఏకే 47, ఆరు పిస్టళ్లు, రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 3వేల లాఠీలు, హాకీ స్టిక్స్, పెద్ద సంఖ్యలో డీజిల్, పెట్రోల్ బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేరా అభిమానులపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. డేరాకు సంబంధించిన 24 వాహనాలను సీజ్ చేసి వాటి నుంచి ఐదు పిస్టళ్లు, 79 రౌండ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి హరియాణాలో 552 మందిని అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్ సంధు వెల్లడించారు. ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, డేరా చీఫ్‌పై అభియోగాలు నమోదైన కేసులో దోషులకు సాధారణంగా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. పలు కేసుల్లో ఇది జీవితఖైదుగా కూడా మారే అవకాశం ఉంది. అసలేం జరిగింది? 2002 నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా డేరా చీఫ్ గుర్మీత్‌ను సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో వేల మంది డేరా అభిమానులు, కార్యకర్తలు కోర్టుముందు గుమిగూడారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో.. అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముందస్తుగానే అల్లర్లపై ప్రణాళికతో సిద్ధమై వచ్చిన ఆందోళనకారులు.. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. సీబీఐ కోర్టు ఉన్న హరియాణాలోని పంచకుల కేంద్రంగానే ఈ గొడవలు ప్రారంభమైనా ఈ సమాచారం దావానలంలా వ్యాపించింది. నిఘావర్గాల హెచ్చరికలు బేఖాతరు! డేరా చీఫ్ అభిమానుల విధ్వంసపు ఆలోచనల సంగతిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ముందుగానే సమాచారం అందించింది. మూడేళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఇదేవిధంగా అన్యాయాలకు పాల్పడిన బాబా రాంపాల్‌ను అరెస్టు చేసే సందర్భంలో అతని అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ గుర్మీత్‌పై కోర్టు తీర్పు ఆధారంగా విధ్వంసానికి అతని అభిమానులు ప్రయత్నించే అవకాశం ఉందని హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ సూచించింది. అయితే సూచనలను ఇరు ప్రభుత్వాలూ పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. హింస మొదలవుతూనే.. పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారంటే ఎంత పకడ్బందీగా దాడులకు వ్యూహరచన జరిగిందో అర్ధమవుతుంది. వీఐపీ సౌకర్యాల్లేవు! కోర్టు తీర్పు నేపథ్యంలో డేరా చీఫ్ రాంరహీమ్ గుర్మీత్ సింగ్‌కు గతంలో కేటాయించిన ‘జడ్ ప్లస్’ భద్రతను హరియాణా ప్రభుత్వం వెనక్కుతీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎస్ దేశీ వెల్లడించారు. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో డేరా చీఫ్‌కు వీఐపీ వసతులు కల్పిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కాగా, జైలు చుట్టుపక్కల భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించారు. వదంతులను నమ్మొద్దని, సంయమనం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు. డేరా అభిమానుల విధ్వంసంతో పంజాబ్–హరియాణాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జమ్మూ శివార్లలోని ప్రధాన రైల్వేస్టేషన్లో ఈ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులను ఆపేశారు. దీంతో వైష్ణోదేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంజాబ్, హరియాణాల్లో జరిగిన విధ్వంసకాండను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. పంచకుల డీసీపీ సస్పెన్షన్ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటంతో విఫలమయ్యారంటూ వివాదానికి కేంద్రబిందువైన పంచకుల డీసీపీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా, కోర్టు సమీపంలో భారీగా జనాలు గుమిగూడుతున్నా వారిని చెదరగొట్టడంలో విఫలమయ్యారని హరియాణా హోం శాఖ అదనపు కార్యదర్శి రాం నివాస్ పేర్కొన్నారు. హరియాణా, పంజాబ్‌లలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి, పారామిలటరీ బలగాల చీఫ్‌లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. పరిస్థితి అదుపులో ఉందని హరియాణా, పంజాబ్ డీజీపీల నుంచి సమాచారం అందినట్లు సమావేశం అనంతరం రాజీవ్ మెహర్షి వెల్లడించారు. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలో 20వేలకు పైగా పారామిలటరీ బలగాలను మోహరించారు. రేప్ కేసులో దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్పై 2002 నాటి ఓ అత్యాచారం కేసులో సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. దీనిపై శుక్రవారం విచారించిన పంచకుల సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్.. డేరాచీఫ్ను దోషిగా తేల్చారు. గుర్మీత్ అరెస్టుకు ఆదేశాలు జారీచేయటంతోపాటుగా సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. తనను దోషిగా తేల్చటంతో రాంరహీమ్ ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన తరపు న్యాయ వాది తెలిపారు. అరెస్టు ఆదేశాలు వెలువడగానే.. డేరాచీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు రాంరహీమ్ వచ్చిన వాహన శ్రేణి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికా>ప్టర్‌లో రోహ్తక్ జైలుకు తరలించారు. కాగా, సీబీఐ కోర్టు న్యాయమూర్తి సోమవారం సునారియా జైలుకెళ్లి గుర్మీత్‌కు విధించాల్సిన శిక్షలను ఖరారు చేయనున్నారు. ఖట్టర్‌ను తొలగించబోం: బీజేపీ డేరా ఉన్మాదకాండ నేపథ్యంలో హరియాణా సీఎం ఖట్టర్‌ను తొలగించాలన్న విపక్షాల డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. ‘హరియాణా, పంజాబ్‌లలో జరిగిన ఘటనలు దురదృష్టకరం. అయినా విధ్వంసం మొదలైన మూడుగంటల్లోనే ప్రభుత్వం పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఇది సీఎం ఖట్టర్ వైఫల్యమేమీ కాదు. ఆయన్ను తొలగించాలన్న ఆలోచనేదీ లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి, హరియాణా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. డేరా ఆందోళనకారుల విధ్వంసకాండతో జరిగిన నష్టాన్ని ఆ సంస్థ ఆస్తుల నుంచే రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
డేరాలంటే ఏమిటీ? వాళ్లకింత బలం ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: డేరా అన్న పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని అంటారు. డేరా అంటే తాత్కాలిక గుడారం లేదా తాత్కాలిక సమావేశ స్థలం. ఎండ తగులకుండా డేరాను వేసుకొని ప్రజలు లేదా ఆధ్యాత్మికవాదులు, తమ నాయకులు లేదా ఆధ్యాత్మిక గురువులు చెప్పే మాటాలను వినేందుకు ఈ డేరాల కింద సమావేశమయ్యేవారు. కాలక్రమంలో డేరాలకు శబ్దార్థం మారుతూ వచ్చింది. మజిలీ, మజ్లీస్ అని, అన్న పానీయాలు అందుబాటులో ఉండే చోట అనే అర్థం కూడా వచ్చింది. ఒకప్పుడు డేరాలంటే తాత్కాలికంగా తాళ్లతో కట్టేవే ఉండేవి. ఇవి కూడా ఆధునిక హంగులను పులుముకుని ఏసీ గదులుగా మారిపోయాయి. ఏదేమైనా పంజాబ్ రాష్ట్రంలో విస్తరించిన డేరాలకు అర్థం చెప్పాలంటే ఆధ్యాత్మిక అంశాల గురించి బోధించే గురువుండే గుడారం. ఒక్కో ఆధ్యాత్మిక గురువుది ఒక్కో గుడారం. ప్రతి గుడారానికి ఓ పేరుంటుంది. గుళ్లు, గోపురాల్లాగే ఓ ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉండే ఈ డేరాలు, అంటే గుడారాలు చాలా చోట్ల సిమెంట్‌తో నిర్మించిన పక్కా మందిరాలుగా కూడా మారిపోయాయి. మతాలకు, డేరాలకు ప్రత్యక్ష సంబంధం ఏమీ ఉండదు. ఆయా మతాల విశ్వసించే గురువులనుబట్టి వారి బోధనలు ఉంటాయి. సిక్కు పవిత్ర గ్రంధం ‘గురు గ్రంథ్ సాహిబ్’ను నమ్మే గురువు ఆ గ్రంధంలో ఉన్న బోధనలే ప్రజలకు విడమర్చి చెప్పవచ్చు. సిక్కు మతాలే కాకుండా ఇతర మతాలకు చెందిన గురువులు కూడా పంజాబ్‌లో డేరాలను నిర్వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పదివేలకుపైగా డేరాలు ఉంటాయన్నది పంజాబ్ యూనివర్శిటీ పొలిటికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పనిచేస్తున్న రోంకీ రామ్ అంచనా. అత్యాచారం కేసులో అరెస్టై జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌ది అందులో ఒక డేరా. డేరా సచ్ఛా సౌదా అన్నది దాని పేరు. ఆయన దేవుళ్లు, మతాలు అన్ని సమానమని చెప్పడానికే తన పేరును ‘గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్’గా మార్చుకున్నారు. డేరాలకు ఓ సిక్కు, క్రిస్టియన్, ముస్లిం లేదా బౌద్ధ మతస్థుడు ఎవరైన నాయకుడిగా అంటే గురువుగా ఉండవచ్చు. ఆ డేరాకు తానే గురువన్న హోదాలో ప్రజలకు ప్రబోధనలు చేయవచ్చు. లేదా ఫలానా గురువు వారసుడినంటూ బోధనలు చేయవచ్చు. ఉదాహరణకు డేరా సచ్‌ఖంద్ బల్లాన్ ‘రవిదాసియా ధర్మాన్ని’ పాటిస్తుంది. అంటే గురువు రవిదాస్ బోధనలను ఆచరిస్తోంది. సచ్ఛా సౌధా, నిరంకారీస్, నాంధారీస్, బినియర్వాలా, రవిదాసియాస్, రాధా సోయామీస్ తదితర డేరాలను సిక్కు యేతర డేరాలుగా పరిగణిస్తారు. సచ్ఛా సౌధా, నిరంకారీస్ లాంటి డేరాలను సిక్కులు నిర్వహిస్తున్నప్పటికీ వాటిని సిక్కు డేరాలుగా గుర్తించడం లేదు. వారు సిక్కుల పవిత్ర గ్రంధాన్ని విశ్వసించి అందులోని బోధనలను చేయడం లేదు. వారు తమకు నచ్చిన అంశాలను నచ్చిన తీరుగా బోధిస్తున్నారు. ఎక్కువ వరకు చాలా డేరాల్లోని గురువులు అన్ని మతాల్లో ఉన్న మంచి అంశాలను ఎంపిక చేసుకొని బోధించడం వల్ల అవి ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండడంతో డేరాలకు వెళ్లే ప్రజల సంఖ్య నానాటికి పెరుగుతూ వచ్చింది. ఫలానా మతం వారికంటూ గిరిగీసుకోక పోవడమే ఈ డేరాల గొప్ప గుణం. దళితులే ప్రధానాకర్షణ పంజాబ్ లాంటి రాష్ట్రంలో డేరాలకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం కొన్ని వందల సంవత్సరాలుగా దళితులను హిందూ, గురుద్వార్, చర్చి, మసీదుల్లోకి అనుమతించక పోవడమే. ఇప్పటికీ కూడా వారికి చాలా చోట్ల అనుమతి లేదు. దేశవ్యాప్తంగా సరసారి 16 శాతం దళితులుంటే ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 33 నుంచి 34 శాతం మంది దళితులు ఉన్నారు. వీరికి డేరాల్లోకి అనుమతి ఉండడంతో వారు ఎక్కువగా డేరాల్లోకి ప్రవేశించడం ఆచారంగా మారింది. పైగా డేరాల్లో ఏ మతస్థులు కూడా తక్కువ కులాల వారిని తక్కువచేసే చూడరు. అలా చూడకూడదని, ప్రజలంతా సమ భావంతో మెలగాలని డేరాల్లో బోధిస్తారు. కనుక డేరాల సంస్కతి ఎక్కువగా నచ్చే ప్రజలు ఉన్నారు. రాజకీయాలకు దూరంగా.... పంజాబ్ నుంచి హర్యానా వరకు విస్తరించిన డేరాలు సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకని చాలా డేరాలు సహజంగానే దూరంగా ఉంటాయి. కానీ అవి కూడా సమాజానికి లోపలే ఉండడం వల్ల సమాజం ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. అందుకనే కొన్ని డేరాలు ఎన్నికల్లో ఫలానా రాజకీయ పార్టీకి ఓటేయండి అంటూ పిలుపు కూడా ఇస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా డేరాలను సందర్శిస్తారు. వారికి కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలసుకుంటారు. వాటిని తీరుస్తామని, అందుకు ప్రతిఫలంగా తమను గెలిపించాలని కోరుతుంటారు. ఇలా రాజకీయ నాయకులు, డేరాల గురువులు పరస్పరం సహకరించుకునే కొత్త సంస్కతి వేళ్లూనుకుంటోంది. హేతువాదిగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు డేరాలను సందర్శించారు. డేరాల మాటున చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు, అరెస్ట్ అవుతున్న వారు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా స్వల్పం. -
‘డేరా’ హింసాకాండ..
-
‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు
ఛండీగఢ్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ ఆయన భక్తులు, డేరా స్వచ్ఛ సౌదా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉత్తరభారతంలోని హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ సృష్టించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనల్లో ధ్వంసమైన ఆస్తుల విలువను డేరా సంస్థ నుంచే ముక్కుపిండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. పంజాబ్, హరియాణా హైకోర్టు శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా వెలువరించిన ఆదేశాల్లో.. డేరా సంస్థకు చెందిన అన్ని ఆస్తులను తక్షణమే జప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం డేరాలు విధ్వంసం చేసిన ఆస్తుల విలువను.. వారి సంస్థ నిధుల నుంచే వసూలు చేయాలని సూచించింది. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసమేకాక హింసాకండలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. 'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల ‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్ -
‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన
- హింసకు పాల్పడవద్దని కోవింద్ పిలుపు - నాలుగు రాష్ట్రాలు ఆగ్రహజ్వాలలు..28 మంది మృతి న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌పై కోర్టు తీర్పు అనంతరం ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు విధ్వంసకాండకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ఒక దశలో కాల్పులు జరిపారు. అల్లర్లలో ఇప్పటివరకు 28 మంది చనిపోగా, వందలమంది గాయపడ్డారు. కాగా, కోర్టు తీర్పు అనంతరం చెలరేగిన హింసాకాండను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఖండించారు. హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. ‘‘ ఇవాళ్టి కోర్టు తీర్పుపై హింస చెలరేగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం నూటికినూరుపాళ్లూ ఖండనీయం. శాంతి నెలకొనేలా ప్రజలంతా సహకరించాలి’’ అని రాష్ట్రపతి తన అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో డేరా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌కు విధించే శిక్షను సోమవారం(ఆగస్టు 28న) వెల్లడించనున్నట్లు కోర్టు పేర్కొంది. తీర్పు అనంతరం దోషిని అంబాలా జైలుకు తరలించారు. 'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల -
‘వాకర్’ గుర్మీత్ కొత్త చరిత్ర
ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నోమి (జపాన్): ఇప్పటికే రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్న ‘వాకర్’ గుర్మీత్ సింగ్ ఆదివారం కొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో గుర్మీత్ స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 20 కిలోమీటర్ల నడక పోటీలో 30 ఏళ్ల గుర్మీత్ గంటా 20 నిమిషాల 29 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఇసాము ఫుజిసావా (జపాన్-1:20ని:49 సెకన్లు) రజతం సాధించగా... జియోర్జి షెకో (కజకిస్తాన్-1:21ని:52 సెకన్లు) కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఆసియా టైటిల్ సాధించి రియో ఒలింపిక్స్ సెలక్షన్ రేసులో తాను ముందున్నట్లు గుర్మీత్ నిరూపించాడు. 20 కిలోమీటర్ల నడక విభాగంలో భారత్ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్నారు. అయితే ఒక దేశం నుంచి ఈ రేసులో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో తొమ్మిది మందికి సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేస్తారు. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత్‌కు చెందిన సప్నా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. -
20 కి.మీ. నడక విజేత గుర్మీత్
జైపూర్: ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు అథ్లెట్లు జాతీయ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాల సమయాన్ని సవరించారు. శనివారం జరిగిన 20 కిలోమీటర్ల నడక రేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ గంటా 21 నిమిషాల 24.57 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం గంటా 24 నిమిషాలు. ఈ రేసులో ఏడుగురు అథ్లెట్లు ఈ సమయాన్ని సవరించడం విశేషం. గణపతి (తమిళనాడు-1గం:21ని.51.43 సెకన్లు) రజతం సాధించగా... సందీప్ కుమార్ (హరియాణా-1గం:21ని.56.81 సెకన్లు) కాంస్య పతకం నెగ్గాడు. కేటీ ఇర్ఫాన్ (కేరళ-1గం:22ని.14.02 సెకన్లు), మనీష్ సింగ్ (ఉత్తరాఖండ్-1గం:22ని.18.89 సెకన్లు), దేవేందర్ సింగ్ (హరియాణా-1గం:22ని.40.60 సెకన్లు), నీరజ్ (హరియాణా-1గం:23.34.02 సెకన్లు) తర్వాతి స్థానాల్లో నిలవడంతోపాటు రియో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని అధిగమించారు.