మనిషే గెలిచిన వేళ.. | Serving Kerala Bishop Donates Kidney to Save Life of Hindu Man | Sakshi
Sakshi News home page

మనిషే గెలిచిన వేళ..

Published Sun, May 29 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

మనిషే గెలిచిన వేళ..

మనిషే గెలిచిన వేళ..

కొట్టాయం: మతాలకు కాదు మనిషికే విలువ ఇవ్వాలని నిరూపించాడు ఓ బిషప్. కళ్లకు కనిపించని మతం కన్న.. కష్టాల్లో కళ్లముందే కదలాడుతున్న సాటిమనిషిని ఆదుకోవడమే ఓ మనిషిగా ప్రథమ కర్తవ్యం అని అని స్పష్టంగా చెప్పాడాయన. కేరళలో ఓ కాథలిక్ చర్చికి బిషప్ గా పనిచేస్తోన్న జాకబ్ మురికాన్ అనే వ్యక్తి ఓ ముప్పై ఏళ్ల హిందూ యువకుడికి తన కిడ్నీ దానం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని గత శుక్రవారం అన్ని లాంఛనాలను పూర్తి చేశారు.

'ఒక బిషప్ గా పనిచేస్తూ ఒకరి జీవితాన్ని కాపాడేందుకు తన మూత్రపిండాన్ని దానంగా ఇవ్వడం బహుషా చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యి ఉండొచ్చు. సూరజ్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. అతడి కుటుంబానికి అతడే దిక్కు. భార్యను తల్లిని తనే చూసుకోవాలి. నాలుగేళ్ల కిందటే తన తండ్రిని కోల్పోయాడు. అతడి గురించి తెలుసుకున్న బిషప్ తన కిడ్నీని దానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ జూన్ 1న ఎర్నాకుళంలోని లేక్షోర్ ఆస్పత్రిలో జరుగుతుంది' అని కిడ్నీ ఫెడరేషన్ చైర్మన్ ఫాదర్ డేవిస్ చిరమాల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement