Catholic Bishop
-
ప్రేమ, సామరస్యమే క్రీస్తు బోధనల సారం
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్‌లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. -
మనిషే గెలిచిన వేళ..
కొట్టాయం: మతాలకు కాదు మనిషికే విలువ ఇవ్వాలని నిరూపించాడు ఓ బిషప్. కళ్లకు కనిపించని మతం కన్న.. కష్టాల్లో కళ్లముందే కదలాడుతున్న సాటిమనిషిని ఆదుకోవడమే ఓ మనిషిగా ప్రథమ కర్తవ్యం అని అని స్పష్టంగా చెప్పాడాయన. కేరళలో ఓ కాథలిక్ చర్చికి బిషప్ గా పనిచేస్తోన్న జాకబ్ మురికాన్ అనే వ్యక్తి ఓ ముప్పై ఏళ్ల హిందూ యువకుడికి తన కిడ్నీ దానం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని గత శుక్రవారం అన్ని లాంఛనాలను పూర్తి చేశారు. 'ఒక బిషప్ గా పనిచేస్తూ ఒకరి జీవితాన్ని కాపాడేందుకు తన మూత్రపిండాన్ని దానంగా ఇవ్వడం బహుషా చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యి ఉండొచ్చు. సూరజ్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. అతడి కుటుంబానికి అతడే దిక్కు. భార్యను తల్లిని తనే చూసుకోవాలి. నాలుగేళ్ల కిందటే తన తండ్రిని కోల్పోయాడు. అతడి గురించి తెలుసుకున్న బిషప్ తన కిడ్నీని దానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ జూన్ 1న ఎర్నాకుళంలోని లేక్‌షోర్ ఆస్పత్రిలో జరుగుతుంది' అని కిడ్నీ ఫెడరేషన్ చైర్మన్ ఫాదర్ డేవిస్ చిరమాల్ అన్నారు.