న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్కు పిలిపించి థరూర్ను ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. సునంద హత్య కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా శశి థరూర్కు సూచించారు. ఆయన ఈ రోజే ఢిల్లీ వచ్చారు.
సునంద హత్య కేసులో ప్రత్యేక విచారణ బృందం ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. మరికొందర్ని విచారించాల్సి ఉందని పోలీస్ కమిషనర్ బస్సి తెలిపారు. గతేడాది జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
శశి థరూర్ను విచారిస్తున్న పోలీసులు
Published Mon, Jan 19 2015 7:51 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
Advertisement
Advertisement