పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సిక్కిం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. బెంగాల్‌లో గుర్ఖాలాండ్ ఉద్యమం కారణంగా తమ రాష్ట్రానికి 60 వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.
గాంగ్‌టక్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సిక్కిం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. బెంగాల్‌లో గుర్ఖాలాండ్ ఉద్యమం కారణంగా తమ రాష్ట్రానికి 60 వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే.
దీనికి పక్కనే సిక్కిం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత 32 ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం జరుగుతుందని, అది జరిగిన ప్రతిసారి తమ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని, ఆ కారణంగా ఈ 32 ఏళ్ల కాలంలో మొత్తం 60వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ ఈ విషయంలో తమకు న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సిక్కిం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.