నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు
న్యూఢిల్లీ: ఐదు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడే దిశగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపైనా చర్చించనున్నారు. మోదీ, లూంగ్‌ల సమక్షంలో భారత పారిశ్రామిక విధానాల, ప్రోత్సాహకాల శాఖతో సింగపూర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేంద్రం మంగళవారం ఢిల్లీలో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, దేశంలోని సింగపూర్‌వాసులతో, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో విడివిడిగా భేటీకానున్నారు. 5, 6వ తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లూంగ్ పర్యటిస్తారు.