bilateral issues
-
చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!
ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది. ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. రష్యా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమస్య అని.. భారత్, చైనానే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈమేరకు భారత్‌కు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శుక్రవారం తెలిపారు. కొన్ని దేశాలు చైనా పట్ల, మరికొన్ని దేశాలు భారత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని డెనిస్ అన్నారు. కానీ తాము అలా కాదని చెప్పారు. వీలైనంత త్వరగా రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఓ తీర్మానానికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ చర్చల్లో ఇతర దేశాల పాత్ర అవసరం లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. అలాగే ఒప్పందం ప్రకారం భారత్‌కు తాము అందించాల్సిన ఎస్-400 వాయు క్షిపణి వ్యవస్థ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్‌లో కుదిరింది. దీని ప్రకారం ఐదు యూనిట్ల వాయు క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు అందించాల్సి ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 12న గోగ్రా హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. చదవండి: 'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు -
భారత్‌తో సంబంధాలపై ఉక్రెయిన్ ప్రభావం లేదు
వాషింగ్టన్: భారత్‌తో తమ సంబంధాలపై రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. ద్వైపాక్షికాంశాలు మాత్రమే ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత సోమవారం చేపట్టిన ప్రొసీజరల్ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటం తెలిసిందే. ఈ నిర్ణయం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన నేరుగా బదులివ్వలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దూకుడుకు సంబంధించి భారత్‌తో పాటు డజన్ల కొద్ది దేశాలతో ఎప్పటికప్పుడు పలు స్థాయిల్లో మాట్లాడుతున్నట్టు చెప్పారు. వాటి మధ్య యుద్ధమే జరిగితే దాని ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపైనా ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా వివాదం కొంతకాలంగా అంతర్జాతీయంగా నలుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సర్వసన్నద్ధంగా ఉందని, కనీసం లక్షకు పైగా బలగాలను సరిహద్దుల సమీపానికి తరలించిందని అమెరికా, యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని తక్షణం సరిహద్దుల నుంచి ఉపసంహరించాలని, కాదని ఉక్రెయిన్‌పై దాడికి దిగితే భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్ తమతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ గౌరవించాలని, ఆ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా డిమాండ్ చేస్తోంది. వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ ఉద్దేశమని చెబుతూ భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. రంగంలోకి జర్మనీ, ఫ్రాన్స్ బెర్లిన్: ఉద్రిక్తతలను తగ్గించేందుకు త్వరలో రష్యా, ఉక్రెయిన్లలో పర్యటించాలని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ నిర్ణయించారు. మాక్రన్ సోమవారం మాస్కో, మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్లనున్నారు. స్కోల్జ్ 14న కీవ్, 15న మాస్కోలో పర్యటిస్తారు. నాటో సభ్య దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయాలపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా తాజాగా ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. -
పాక్ ప్రధానితో మోదీ భేటీ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య త్వరలోనే ఓ సమావేశం జరిగే అవకాశం ఉందని పాకిస్తానీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య భేటీ ఎలా సాధ్యమన్న అనుమానాలున్నా, జూన్ నెలలో జరగనున్న షాంఘై సహకార సమితి (ఎస్సీఓ) సమావేశాల సమయంలోనే వీరిద్దరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమావేశం కజకిస్థాన్‌లోని అస్తానాలో జరగాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు కుల్‌భూషణ్ యాదవ్ ఘటన కారణంగా దెబ్బ తినకూడదని పాక్ భావిస్తోందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలన్నదే తమ విధానమని పాక్ రక్షణ విశ్లేషకుడు, రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికారి తలత్ మసూద్ అన్నారు. ఎస్సీఓలో ఉన్న ప్రభావవంతమైన దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెబుతున్నాయి. అందుకే పాక్ నుంచి ఇలాంటి సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమిలో రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలు, భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. సంస్థ ప్రయోజనాలను కాపాడటంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటామన్న నిబంధనతోనే ఈ దేశాలకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. -
నేడు మోదీతో సింగపూర్ ప్రధాని చర్చలు
న్యూఢిల్లీ: ఐదు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడే దిశగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపైనా చర్చించనున్నారు. మోదీ, లూంగ్‌ల సమక్షంలో భారత పారిశ్రామిక విధానాల, ప్రోత్సాహకాల శాఖతో సింగపూర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేంద్రం మంగళవారం ఢిల్లీలో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, దేశంలోని సింగపూర్వాసులతో, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో విడివిడిగా భేటీకానున్నారు. 5, 6వ తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లూంగ్ పర్యటిస్తారు. -
మనం కలిస్తే ప్రపంచాన్నే మార్చొచ్చు
* చైనా అధ్యక్షుడితో భేటీలో రాష్ట్రపతి ప్రణబ్ * ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల చర్చలు బీజింగ్: భారత్, చైనాలు కలసి పనిచేస్తే ప్రపంచ శాంతి, శ్రేయస్సు, అభివృద్ధిలో అద్భుతమైన మార్పులు తేవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గురువారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఆయన చర్చించారు. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో ప్రణబ్‌కు జిన్‌పింగ్ స్వాగతం పలికారు. తన పర్యటన ఇరుదేశాల మధ్య స్నేహ బంధాన్ని ధృడపరచడంతో పాటు ప్రజల మద్దతు పెరిగేందుకు, సంబంధాల్ని అర్థంచేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారత్, చైనాలు అతిపెద్ద ఆర్థిక దేశాలుగా ఎదుగుతున్నాయని, ప్రపంచ వేదికపై ప్రధాన శక్తులుగా ఉన్నాయని ప్రణబ్ అన్నారు. 125 కోట్ల మంది భారత ప్రజల తరఫున అభినందల్ని తీసుకొచ్చాన ని జిన్‌పిన్‌కు తెలిపారు. ప్రణబ్ ఎంతో అనుభవం గల నేతని, చైనా ప్రజలకు పాత స్నేహితుడని, ఇరు దేశాల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించేందుకు ఎంతో కాలంగా కట్టుబడి ఉన్నారంటూ జిన్‌పింగ్ ప్రసంశలతో ముంచెత్తారు. భారత్, చైనాలు సంస్కరణలు, అభివృద్ధి పరంగా కీలక దశలో ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు. స్నేహానికి నిబద్ధతతో ఉన్నాం: చైనాతో సంబంధాల బలోపేతానికి ద్వైపాక్షిక నిబద్ధత అవసరమని ప్రణబ్ అన్నారు. పెకింగ్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ చతురత, నాగరితకపై పరిజ్ఞానం ద్వారా సరిహద్దు వివాదం వంటి ఎన్నో సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో భారత-చైనా సంబంధాల బలోపేతానికి 8 అంశాల్ని ప్రణబ్ ప్రస్తావించారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం విస్తృతంగా రాజకీయ సంప్రదింపులు జరగాలన్నారు. ఇరు దేశాలు ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం పెరిగిందని, విభేదాల్ని ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకున్నాయని ప్రణబ్ చెప్పారు. విద్యారంగంలో సహకారం కోసం భారత్‌కు చెందిన 10 విశ్వవిద్యాలయాలు చైనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నాయి. -
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
-
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
అబుదాబి: పశ్చిమాసియా దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలలో బయటి దేశాల ప్రమేయం వల్లనే అశాంతి పెరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చిన సందర్భంగా మోదీ, స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సమస్యలు ఆయా దేశాలు పూనుకుంటేనే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. పశ్చిమాసియా దేశాలన్నింటితో భారత్‌కు సత్సంబంధాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్గత సమస్యల్లో జోక్యం చేసుకోకూడదన్న మౌలిక నియమాన్ని భారత్ పాటిస్తూ, వివిధ అంశాల్లో చర్చలకు మద్దతిస్తోందన్నారు. ఈ ప్రాంత దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా శాంతి స్థాపనకు కృషి చేయాలని, ఈ కృషి కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో అగ్రదేశాల అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన సమస్యలు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు అణు ఒప్పందం అనేది ఈ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణం కానే కాకూడదు’ అని అన్నారు. పరస్పర విశ్వాసంతో ఈ ప్రాంతంలో చర్చలు, సహకారం మొదలవాలని అన్నారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వెళ్లిన మోదీ సాయంత్రం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఆయన ఐదుగురు సోదరులూ మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సైనిక దళాల వందనాన్ని మోదీ స్వీకరించారు. ప్యాలెస్‌లో తనకు ఏర్పాటు చేసిన బసకు మోదీ చేరుకున్నారు. అక్కడ యువరాజుతో కాసేపు చర్చలు జరిపారు. శాంతికి ప్రతీక ఈ మసీదు.. అక్కడి నుంచి ముందుగా అరబ్‌లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు. ‘ఈ అపూర్వమైన పవిత్ర మసీదును సందర్శించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన నైపుణ్యానికి, సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ. శాంతికి, కరుణకు, సౌభ్రాతృత్వానికి, ఇస్లాంపై అచంచలమైన విశ్వాసానికి ఇది ప్రతీక’ అని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు. కీలక భాగస్వామిగా యూఏఈ యూఏఈతో తన చర్చల ఎజెండాను ఖలీజ్టైమ్స్కు ఇంటర్వ్యూలోనే మోదీ స్పష్టంగా సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలలో యూఏఈతో కీలక భాగస్వామ్యం నెరపడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. రెండు దేశాలు ఉగ్రవాదం, తీవ్రవాదంతో సహా కొన్ని అంశాలలో ఒకే విధమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ అంశాలు రెండు దేశాలకు అత్యధిక ప్రాధాన్యాంశాలన్నారు. భద్రత విషయంలో యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇంధనం, పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు. వ్యాపారానికి భారత్ ఆకర్షణీయ గమ్యంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించటం తన లక్ష్యమన్నారు. 1970లలో 180 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న యూఏఈ-భారత్ వ్యాపార బంధం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లతో భారత్ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని.. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. భారతీయ కార్మికులతో భేటీ ఆ తర్వాత భారత్ నుంచి వలస వచ్చిన కార్మికులను ఐ-కాడ్ కార్మికుల రెసిడెన్షియల్ క్యాంప్ హౌస్‌లో కలిసి వారి సమస్యలపై చర్చించారు. క్రీడా హాల్లో వారితో ఫొటోలు దిగారు. ఈ దేశ అభివృద్ధిలో 26 లక్షల మంది భారతీయులు భాగస్వామ్యం వహించటం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం యువరాజుతో చర్చలు జరిపిన అనంతరం మోదీ దుబాయ్‌కి వెళ్తారు. అక్కడ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచంలో అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. అనంతరం దుబాయ్ క్రికెట్ మైదానంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని యూఏఈలో ఒక దేవాలయం నిర్మించుకోవటానికి స్థలం కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ సెల్ఫీ దౌత్యం అరబ్ దేశంలో కూడా కొనసాగింది. ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించిన సందర్భంగా మోదీ అరబ్ రాజకుటుంబీకులు, షేక్‌లతో సెల్ఫీ దౌత్యం నెరిపారు. మీగడ రంగు కుర్తా, కాషాయం తెలుపు లాల్చీ ధరించిన మోదీ మసీదుకు వచ్చిన షేక్‌లతో తన మొబైల్‌తో సెల్ఫీకి పోజ్లిచ్చారు.