న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) విస్తృతంగా దర్యాప్తు చేయనుంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న మరికొంతమంది భారతీయులను విచారణ జాబితాలోకి తీసుకువచ్చింది.
ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నవారితో పాటు కొత్తగా మరికొంతమందిని విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే అక్రమాలకు పాల్పడినట్టు రుజువయిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిట్ స్పష్టం చేసింది. భారతీయ స్విస్ ఖాతాదారులను మరికొంతమందిని గుర్తించామని, విచారణ చేయనున్నట్టు సిట్ చైర్మన్ ఎంబీ షా చెప్పారు.
సిట్ జాబితాలోకి మరికొన్ని పేర్లు
Published Mon, Feb 9 2015 5:35 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement