మహిళా రోగిపై అమానుషం
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. మహిళా రోగిని జాగ్రత్తగా కాపాడాల్సిన ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మంచానికే పరిమితిమైన (
బెడ్ రిడెన్) ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని(36) పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... గణేష్ నాయక్ ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మధ్య వయస్కురాలైన మహిళకు నర్సింగ్ కేర్ తీసుకునేందుకు గణేష్ ను నియమించింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పనిని కేటాయించింది. ఈ క్రమంలో గణేష్ రోజూ రోగి యింటికి వెళ్లి నర్సింగ్ సేవలు అందించేవాడు. అయితే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతగాడు.. ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. రోగి అన్న విచక్షణ సైతం మరచి ఆమెపై పలుమార్లు దారుణంగా లైంగికదాడికి తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడి నిర్వాకం బయటపడింది.