తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ | Son Of Hizbul Chief Syed Salahuddin Saved By Forces In Pampore Attack | Sakshi

తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ

Feb 25 2016 11:43 AM | Updated on Sep 3 2017 6:25 PM

తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ

తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ

పాంపోర్ ఎన్ కౌంటర్ నుంచి తీవ్రవాది అగ్రనేత కొడుకును భద్రతా బలగాలు కాపాడాయి.

శ్రీనగర్: పాంపోర్ ఎన్ కౌంటర్ నుంచి తీవ్రవాది అగ్రనేత కొడుకును భద్రతా బలగాలు కాపాడాయి. గతవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు సందర్భంగా 100 మందిని భద్రతా దళాలు రక్షించాయి. వీరిలో తీవ్రవాద సంస్థ హిజబుల్ ముజాహిద్దీన్ అగ్రనేత సయిద్ సలావుద్దీన్ కుమారుడు సయిద్ మొయిన్ ఉన్నాడు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఈడీఐ)లో మొయిన్  ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సలావుద్దీన్ ముగ్గురు కొడుకుల్లో మొయిన్ ఒకడని, అతడికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈడీఐపై ఉగ్రవాదుల దాడి తర్వాత మొయిన్ ను పోలీసులు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్ కు చెందిన లష్కరే-ఈ-తోయిబా ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ఈడీఐ భవంతిలోకి చొరబడిన విషయం విదితమే. మూడు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement