ఎస్పీ బాలు ఖాతాలో ‘కేరళ’ అవార్డు | SP Balu win a 'Kerala' award | Sakshi
Sakshi News home page

ఎస్పీ బాలు ఖాతాలో ‘కేరళ’ అవార్డు

Published Sat, Apr 18 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

ఎస్పీ బాలు ఖాతాలో ‘కేరళ’ అవార్డు

ఎస్పీ బాలు ఖాతాలో ‘కేరళ’ అవార్డు

తిరువనంతపురం: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ప్రతిష్టాత్మక ‘హరివరసనం’ అవార్డును ఈ ఏడాది బాలుకు అందజేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమలై హై-పవర్ కమిటీ చైర్మన్ కె.జయకుమార్, కేరళ మంత్రి వీఎస్ శివకుమార్ అవార్డు వివరాలను శుక్రవారం వెల్లడించారు.

లౌకికత్వ వ్యాప్తికి కృషి, శాంతి, శబరిమల అయ్యప్పస్వామిపై పలు భాషల్లో గీతాలాపనను పరిగణనలోకి తీసుకుని ఆయనకు అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో బాలుకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను బహుకరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement