అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టుకు స్పీకర్ వినతి
నైనిటాల్/న్యూఢిల్లీ: అనర్హతను వ్యతిరేకిస్తూ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలంటూ ఉత్తరాఖండ్ స్పీకర్ శనివారం ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ... 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అతిక్రమిస్తే... అనర్హతపై ఎలా స్టే కోరతారని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినప్పుడు, మెమొరాండంపై సంతకం చేసినప్పుడు(ఓటింగ్‌పై డివిజన్) అది అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వారికి తెలుసన్నారు. స్పీకర్ నుంచి సరైన పత్రాలు అందలేదంటూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని, దాని ఆధారంగా పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు. పిటిషన్‌లోని తప్పొప్పుల జోలికి వెళ్లకుండా ముందుగానే దాన్ని తోసిపుచ్చాలన్నారు. అనంతరం అనర్హత ఎమ్మెల్యే పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 25కు జస్టిస్ ధ్యానీ వాయిదా వేశారు.
హరీశ్ రావత్ నిర్ణయాలన్నీ రద్దైనట్లే..!
ఏప్రిల్ 21న రాష్ట్రపతిపాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేయడంతో సీఎంగా హరీశ్ రావత్ బాధ్యతలు స్వీకరించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 21 రాత్రి, ఏప్రిల్ 22 ఉదయం రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్విహ ంచి దాదాపు 18 నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. వాటిని వెనువెంట నే అమలు చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయాలన్నీ రద్దయినట్లేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
కాంగ్రెస్ నోటీసులు.. సోమవారం నుంచి జరగనున్న రాజ్యసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్ని రద్దు చేసి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించాలంటూ ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్, కాంగ్రెస్ ఉప నేత ఆనంద్ శర్మలు నోటీసులిచ్చారు. రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని శర్మ మరో నోటీసు ఇచ్చారు.
అనర్హుల పిటిషన్ తోసిపుచ్చండి
Published Sun, Apr 24 2016 1:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement